తెలుగు చిత్ర పరిశ్రమకి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ పరిచయమైన నటి కృతి శెట్టి. ఆమె తన మొదటి సినిమాతోనే అందం అభినయంతో మాత్రమే కాదు హిట్ కూడా అందుకుని ఇండస్ట్రీ వారిని కూడా ఎంతగానో ఆకట్టుకుంది కృతి శెట్టి. ఆమె మంచి నటన కనపరచడంతో పాటు సినిమాలో ఆమె ప్రజెన్స్ కూడా బాగుంది అనే టాక్ రావడంతో సినిమాపై అందరి కన్ను పడిందనే చెప్పాలి మరి.

ఈ నేపథ్యంలోనే  కొంతమంది యువ హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫీచర్స్ కనిపిస్తున్న ఈమెను హీరోయిన్ గా తీసుకుని హిట్ సంపాదించాలని యువహీరోలు అనుకుంటున్నారు. కృతిశెట్టి ఇప్పటి వరకు తెలుగులో చేసిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అందరూ ఆమెను గోల్డెన్ లెగ్ అని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే  హిట్ లేని హీరోలు కూడా ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో పని చేసే కొద్ది ఎవరో ఒకరితో హీరోయిన్లు కనెక్ట్ అవ్వడం సాధారణమైన విషయం అయ్యినప్పటికీ దానిని సినీ భాషలో ఎఫైర్ అంటారు.

అయితే చాలా చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇంతవరకి ఆ హీరోతో  ఒక్క సినిమా చేయకుండా కూడా ఫ్రెండ్స్ పార్టీలో కలిసిన ఆ హీరోని చూసి ఆమె ఫిదా అయ్యినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఆమె అతనితో డేటింగ్ లు గట్రా చేస్తుందంటూ టాక్ వినిపిస్తుంది. ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆమె కెరీర్ ప్రమాదం లో పడే అవకాశం ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హీరో ఎవరు.. అసలు ఈ కుర్ర హీరోయిన్ విషయంలో వస్తున్న ఈ వార్తలు నిజం ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: