టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నది. కాజల్ చిరంజీవికి జంటగా నటించిన ఆచార్య మూవీ ఏప్రిల్ నెల 1వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా గత సంవత్సరం మే నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఒక సెంటిమెంట్ వల్ల ఈ సినిమా పక్కా హిట్టేనని కాజల్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని ఖచ్చితంగా చెప్పాలి. కాజల్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలలో 4 సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలలో మూడు సినిమాలు హిట్ కొట్టగా ఒక సినిమా మాత్రం ఫ్లాప్ అవ్వడం జరిగింది.

2010 వ సంవత్సరంలో ఏప్రిల్ నెల లో విడుదలైన డార్లింగ్ సినిమాతో కాజల్ అగర్వాల్ హిట్ ను సొంతం చేసుకున్నది.2011 వ సంవత్సరంలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో కాజల్ అగర్వాల్ మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాతో కాజల్ ఖాతాలో మరో హిట్ చేరింది. అయితే ఏప్రిల్ నెలలో కాజల్ అగర్వాల్ నటించి విడుదలైన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ప్లాప్ గా నిలిచి ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచడం జరిగింది. ఇక ఆచార్య సినిమాకు కాజల్ సెంటిమెంట్ కలిసొస్తుందని అభిమానులు ఎంతగానో భావిస్తున్నారు.ఇక మరోవైపు డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన అన్ని సినిమాలలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోలేదు.ఇక ఈ ఆచార్య సినిమాపై అభిమానుల నమ్మకం నిజమవుతుందో లేదో తెలియాలంటే మరో మూడు నెలలు వెయిట్ చెయ్యాల్సిందే

మరింత సమాచారం తెలుసుకోండి: