టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. 'అల వైకుంఠపురంలో' సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు.నార్త్ ఇండియాలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఎక్కడ చూసినా 'పుష్ప' సినిమా మేనియానే. అంత బాగా ఈ సినిమాను చిత్రబృందం వారు ప్రమోట్ చేసుకున్నారు.ప్రస్తుతం 'పుష్ప 2' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇందులో అదనంగా ఒకట్రెండు పాత్రలు వచ్చి చేరతాయని సమాచారం తెలుస్తుంది.ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమా తరువాత బన్నీతో సినిమాలు చేయాలని కొరటాల ఇంకా అలాగే బోయపాటి లాంటి దర్శకులు భావిస్తున్నారు.కానీ బన్నీ మాత్రం ఓ భారీ ప్రొడక్షన్ హౌస్ తో డీల్ పెట్టుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది.

గతంలో రజినీకాంత్ హీరోగా రోబో 2.ఓ సినిమాను రూపొందించిన బిగ్ ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు బన్నీతో సినిమా చేయాలనుకుంటుంది. ఇప్పటికే బన్నీని సంప్రదించినట్లుగా సమాచారం తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ సినిమా కావడంతో బన్నీ కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది.ఇక అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇంకా డైరెక్టర్ ఎవరనే విషయం మాత్రం ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ 'ఇండియన్ 2' సినిమాను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యి ఉంది. ఆ సినిమా ప్రాజెక్ట్ పూర్తయ్యాక బన్నీ సినిమాను పట్టాలెక్కిస్తారేమో అనేది చూడాలి! పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డార్లింగ్ ప్రభాస్ లాగానే పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు అనడానికి ఇదే కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి: