రైట్ రైట్ రీరైట్
ఇదీ న‌యా ఫార్ములా
అలా చేస్తే సినిమా హిట్
మంచి ఔట్ పుట్ వ‌చ్చేంత వ‌ర‌కూ
రాస్తూనే ఉంటే బాగుంటుంది  
వెర్ష‌న్ లు ఎన్ని కొత్త‌వి వ‌స్తే సినిమా అంత గొప్ప‌గా
వ‌చ్చింద‌ని లేదా రానుంద‌ని ఓ నియమం కూడా!
ఇట్స్ ఎ ఒన్ కైండ్ ఆఫ్ స‌క్సెస్ ఫార్ములా!


ఇప్పుడొస్తున్న సినిమాల‌న్నింటికి ఒకే ఫార్ములా వ‌ర్కౌట్ అవుతుంద‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.అదే రీరైట్.క‌థ‌ను ఎంత బాగా రాయగ‌లిగితే అంత మంచి విజ‌యాలు అందుకోవ‌చ్చు అన్న ప్రాథ‌మిక సూత్రాన్ని మ‌న ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు బాగానే అర్థం చేసుకుంటున్నారు.అందుకే వీలున్నంత మేర‌కు క‌థ‌ను పునః క‌థ‌నం చేసేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.ఈ కోవలో చాలా సినిమాలు ప‌ట్టాలెక్కుతున్నాయి. కొన్ని ప‌ట్టాలెక్కాక కూడా షాట్ గ్యాప్ లో షూట్ గ్యాప్ లో రాసిన‌వి తిర‌గ రాసిన‌వి కూడా ఉన్నాయి. ఓ విధంగా ఇదే చాలా మంచి ప‌ద్ధ‌తి. వీలున్నంత మేర క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం అన్న‌ది చాలా మంచి ప‌ద్ధ‌తి. ఈ విధానంలో మెరుగయిన క‌థ‌నం, పాత్ర‌ల స్వ‌భావాల‌ను ఇంకాస్త గొప్ప‌గా చెప్ప‌గ‌ల‌గ‌డం, అదేవిధంగా కీలక స‌న్నివేశాల‌కు సంబంధించి మ‌రింత తీవ్ర‌త‌ను ఆపాదించి రాసుకోవడం ఇవ‌న్నీ సాధ్యం అయితే మంచి సినిమా స్క్రిప్ట్ అన్న‌ది సిద్ధం అవ్వ‌డం ఖాయం.

తాజాగా ఎఫ్ 3 విష‌యంలోనూ, బంగార్రాజు విష‌యంలోనూ జ‌రిగిందిదే అని తెలుస్తోంది.ఇప్పుడు అఖిల్ హీరోగా చేస్తున్న ఏజెంట్ సినిమాను కూడా ఇలానే రీరైట్ చేస్తున్నార‌ని స‌మాచారం.డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కొన్ని సీన్లు రీరైట్ చేశాక షూట్ చేయాల‌ని కూడా అనుకున్నారు.క‌రోనా కార‌ణంగా వ‌చ్చిన షూట్ గ్యాప్ ను ఈ విధంగా వినియోగించుకున్నారు.

బంగార్రాజు సినిమా విష‌యంలో రీరైట్ అన్న‌ది ప‌ని చేసింది. క‌థ‌ను ఇంకా బాగా డెవ‌ల‌ప్ చేశాకే సెట్స్ మీద‌కు వెళ్లాల‌న్న నియ‌మంలో ఇప్పుడున్న ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉండ‌డం మంచిదే! అలా అని అదే ప‌నిగా రీరైట్ చేసుకుని షూట్ ను అయితే డిలే చేయ‌డం అంత మంచి ప‌ద్ధ‌తి కాదు అన్న వాద‌న కూడా ఉంది. డైరెక్ట‌ర్ సుకుమార్ ఇలాంటి నింద‌నే ఎప్పుడూ మోస్తుంటారు. ఆ షూట్ మోడ్ లో ఉన్న‌ప్పుడు కూడా సెట్స్ లో రాస్తూనే ఉంటార‌ని ఒకంత‌ట ఏదీ తేల్చ‌ర‌ని ఓ నింద ఉంది. అలా కాకుండా మోస్ట్  కాన్ఫిడెంట్ లెవ‌ల్ అన్న‌ది ఓ రైట‌ర్ కు ఉంటే ఏద‌యినా సాధ్య‌మే!


మరింత సమాచారం తెలుసుకోండి: