టాలీవుడ్ కింగ్ నాగార్జున,  ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా ఆ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడం మాత్రమే కాకుండా సినిమాపై అంచనాలను కూడా అమాంతం పెంచేసింది. ఇది ఇలా ఉంటే మొదట ఈ సినిమాకు ఘోస్ట్ అనే టైటిల్ ను చిత్ర బృందం పిక్స్ చేయడంతో ఇదేమైనా హర్రర్ సినిమానా అని చాలామంది అనుకున్నారు, కాకపోతే ఈ సినిమాలో నాగార్జున పాత్ర గురించి కానీ, అలాగే సినిమా కథ గురించి కానీ ఏలాంటి విషయాలు బయటకు రాలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది, ఘోస్ట్ అంటే ఒక ఆపరేషన్ కు పెట్టుకున్న పేరు గా తెలుస్తోంది. సినిమాను స్టైలిష్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తీర్చి దిద్దుతున్నట్లు తెలుస్తోంది, ఇప్పటివరకు ఘోస్ట్ సినిమా షూటింగ్ 20 రోజుల వరకు పూర్తి అయ్యింది. 

ఆ తర్వాత నాగార్జున 'బంగార్రాజు' సినిమా మొదలుపెట్టడంతో ఘోస్ట్ సినిమా షూటింగ్ ఆగిపోయింది, ఇది ఇలా ఉంటే ఇప్పటికే బంగార్రాజు సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శించబడుతుంది, అయితే బంగార్రాజు సందడి ముగియడంతో ఘోస్ట్ సినిమాను తిరిగి ప్రారంభించే ఆలోచనలో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది, ఈనెల రెండో షెడ్యూలు ను మొదలుపెట్టే ఆలోచనలో ఘోస్ట్ చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను యూకే లో చిత్రీకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది, అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా యూకే కి వెళ్తారా, లేదంటే ఇండియాలోనే షూటింగ్ ను ముగిస్తారో అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: