సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'బంగార్రాజు' సినిమా .. అటు నాగార్జున కెరీర్లోనూ ఇటు నాగ చైతన్య కెరీర్లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనాలు చేస్తున్నారు.ఫస్ట్ డే ఈ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టిగానే నిలబడింది. 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రానికి సీక్వెల్ గా వచ్చింది కాబట్టి.. దాని క్రేజ్ కూడా ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయ్యింది.'బంగార్రాజు' గా మరో పక్క రాముగా కింగ్ నాగార్జున ఈ సినిమాలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకోగా..అలాగే 'బంగార్రాజు' మనవడు చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య తన మార్క్ నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక అతనికి జోడీగా ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించింది. సర్పంచ్ నాగ లక్ష్మీగా ఆమె ఈ సినిమాలో కనిపించింది. మొదటిసారి ఆమె ఈ సినిమాలో కామెడీ కూడా ట్రై చేసింది.

లంగా వోణి ఇంకా చీరల్లో ఆమె లుక్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను చాలా బాగా ఆకట్టుకున్నాయి.ఈ సినిమాతో కృతి శెట్టి హ్యాట్రిక్ హిట్ ను కంప్లీట్ చేసింది. నిజానికి ఈ పాత్రకి ముందుగా వేరే హీరోయిన్ వద్దకు వెళ్ళాల్సిందట. అయితే చివర్లో కృతి శెట్టి ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. 'ఉప్పెన' సినిమా షూటింగ్ టైములో 'బంగార్రాజు' టీం కృతి శెట్టిని సంప్రదించడం జరిగిందట. అయితే అప్పటికే ఆమె మరో రెండు సినిమాలకి కమిట్ అవ్వడం వలన డేట్స్ ఇష్యు తలెత్తుతుందేమో అని భావించి ఈ యంగ్ బ్యూటీ ఈ సినిమాకి నొ చెప్పిందట.దీంతో రష్మిక మందనని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు 'బంగార్రాజు' టీం. అయితే అదే టైంకి కృతి శెట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తానని వెనక్కి వచ్చి ఈ ప్రాజెక్టుని ఓకె చేసిందట. ఇక కృతి శెట్టి పాత్రని రష్మిక కనుక చేసి ఉంటే.. రెస్పాన్స్ ఏ విధంగా ఉండేదో మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: