టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వచ్చి రెండు మూడు సినిమాలు చేసినా కూడా నిధి అగర్వాల్ కు ఎలాంటి గుర్తింపు రాలేదు. కానీ ఏ క్షణాన ఇస్మార్ట్ శంకర్ సినిమా అవకాశం తనకు వచ్చిందో కానీ అప్పుడే నిధి అగర్వాల్ దశ తిరిగినట్లు అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడం మాత్రమే కాకుండా నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అలా నిధి అగర్వాల్ ఆ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ తో పాటు మరిన్ని అవకాశాలను కూడా అందుకుంది. 

ప్రస్తుతం సౌత్ సినిమా పరిశ్రమలో ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అందానికి అందం అభినయానికి అభినయం రెండూ కలగలిపి నటించే నటీమణులు సౌత్ సినిమా పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్న నేపథ్యంలో నిధి అగర్వాల్ ఆ లోటును భర్తీ చేస్తుంది. గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడని అందాల ముద్దుగుమ్మ అయిన నిధి అగర్వాల్ ను కళ్ళు మూసుకుని తన సినిమాలలో పెట్టుకుంటున్నారు. ఆ విధంగా ఇటీవలే హీరో అనే చిత్రంలో హీరోయిన్ గా చేసింది నిధి అగర్వాల్. 

ఓ కొత్త హీరోతో సినిమా చేయడానికి కారణం ఏంటి అని మొదట్లో నిధి అగర్వాల్ పై చాలా విమర్శలు వచ్చాయి.  కారణం ఏదైనా కానీ ఆమె ఈ సినిమాలో నటించి మంచి పని చేసిందని అప్పుడు విమర్శించిన నోల్లే ఇప్పుడు ఆమెను పోగు. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా బాగా ఉండటంతో పాటు చాలా కొత్త గా ఉందట.  అందుకే ఈ సినిమాలో నటించడానికి ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆమెకు ఇప్పుడు మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరో సరసన కూడా ఆమెకు అవకాశం వచ్చిందట. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమాలో ఆమె హీరోయిన్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: