అల్లు వారి ఫ్యామిలీ లో హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు అల్లు శిరీష్. టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ తనయుడు అయిన అల్లు శిరీష్ కి ఈ విధమైన ఇబ్బందులు రావడం నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే.  ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చి చాలా సినిమాలు చేసినా కూడా విజయం అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఈ హీరోకి ఎందుకు అదృష్టం ఏ మాత్రం కలిసి రావడం లేదు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. 

ఆ విధంగా ప్రస్తుతం మంచి మంచి సినిమాలతో అలరించనున్నాడు శిరీష్. అందుకే కొంత గ్యాప్ తీసుకుని మంచి కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు. అల్లు శిరీష్ సినిమా పరిశ్రమలోకి వచ్చిన చేసిన సినిమా ల్లో బాగుంది అనిపించే సినిమా ఒక్క శ్రీరస్తు శుభమస్తు సినిమానే. పోనీ నటనా పరంగా వెనుకబడి పోయాడు అంటే అది కూడా కాదు అన్న అల్లు అర్జున్ కి తగ్గ రేంజ్ లో అల్లు శిరీష్ భారీ స్థాయిలో సత్తా ఉన్నవాడే. కానీ మంచి కథ ఆయన ఇమేజ్ గురించి తెలిసిన దర్శకుడు పడడం లేదు అంతే. ఆ విధంగా ఆయన ఓ లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమాలో ఆయన సరసన అను ఇమ్మానియేల్ నటిస్తుండగా ఈ చిత్రం తప్పకుండా తమకు మంచి హిట్ తీసుకువస్తుందని ఈ ఇద్దరు భావిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఆయన పై బోలెడు రూమర్స్ వస్తున్నాయి. టాలీవుడ్ లోని ఓ హీరోయిన్ తో ఆయన ప్రేమలో మునిగి తేలుతున్నట్లు, డేటింగ్ లో ఉన్నట్లు, తొందర్లోనే పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ దీనిపై కూడా అల్లు శిరీష్ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ను ఈ హీరోయిన్ అల్లు ఫ్యామిలీ కి దూరం చేయాలనే చూస్తుంది అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఎలాంటి సంచలనమైన ఆన్సర్ వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: