అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఆయనకు భారీ స్థాయి లో దేశ వ్యాప్తం గా ఇమేజ్ పెంచింది. ఈ సినిమాలో ఆయన నటించిన తీరు డైలాగులు పలికిన తీరు కి దేశంలోని ప్రతి ఒక్కరూ దాసోహం అయ్యారు అని చెప్పాలి.  ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం సుకుమార్ ఒకరైతే మరొక కారణం అల్లు అర్జున్. ఆయన గతంలో ఏ సినిమాలో నటించని విధమైన నటన ను ఈ చిత్రంలో కనబరిచాడు. భారీస్థాయిలో ఆశలు పెట్టుకుని ఈ సినిమాను చేశాడు. ఆ విధంగా ఎన్నో అనుమానాలు మధ్య డిసెంబర్ 17వ తేదీన విడుదల అయ్యి ఇప్పుడు ఇంతటి స్థాయి విజయాన్ని అందుకుంది. 

మొదట్లో ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు.. తప్పకుండా భారీ ఫ్లాప్ గా మిగిలిపోతుందని విమర్శలు చేశారు. వాటన్నిటినీ తట్టుకొని ఇప్పుడు ఈ చిత్రం దేశవ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది అంటే యూనిట్ ఎంతగా కష్టపడిదో అర్థం చేసుకోవచ్చు. అయితే అల్లు అర్జున్ పాన్ ఇండియా కెరియర్ ఇంత గ్రాండ్ గా మొదలవుతుందని ఎవరు అనుకోని ఉండరు. అంతేకాదు ఈ సినిమా విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కొంత మంది నిర్మాతలు ఆయనతో సినిమా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా దేశంలోనే అతిపెద్ద సినిమా సంస్థగా ఉన్న లైగర్ ప్రొడక్షన్స్ సంస్థ వారు అల్లు అర్జున్ తో సినిమా చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు భారీగా అడ్వాన్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం  ఇండియన్2 చిత్రం చేసే పనిలో ఉన్న ఈ సంస్థ తొందర్లోనే ఈ అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. భారీ సినిమాలను నిర్మించే ఈ సంస్థ అల్లు అర్జున్ తో సినిమా చేయడం నిజంగా పెద్ద విశేషం అనే చెప్పాలి. మరి అల్లు అర్జున్ కు వచ్చిన ఈ భారీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ తర్వాత కాలంలో ఎంతటి స్థాయికి తీసుకు వెళతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: