ఒకప్పుడు హీరోయిన్గా తిరుగులేని చరిస్మా తో రాణించిన జయలలిత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించింది. దాదాపుగా స్టార్ హీరోలతో సమానమైన స్టార్ డమ్ సంపాదించి చిత్ర పరిశ్రమను ఏలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక తెలుగు తమిళం కన్నడం అనే తేడా లేకుండా అన్ని భాషలలో కూడా నటించి తన ప్రతిభను చాటింది జయలలిత. అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించిన జయలలిత డాన్సులతో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది అని చెప్పాలి.


 ఇలా దక్షిణాది చిత్రపరిశ్రమలో  ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించిన జయలలిత ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి సంచలనమే సృష్టించారు. ఏకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లో గెలిచి ప్రభంజనం సృష్టించారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రతిపక్షాలను గడగడలాడించారూ ఇక తమిళ ప్రజలు అందరికీ కూడా అమ్మ గా మారిపోయారు ఆమె. అయితే ఇలా జీవితంలో ఎంతో సాధించిన జయలలితకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టంఉండేదట.



 ఇక చిన్నప్పటినుంచే క్రికెట్ కు సంబంధించి ఏ ఫోటో కనిపించిన కూడా దాని కత్తిరించి తన దగ్గర భద్రంగా దాచుకోవడానికి ఇష్టపడేవారట. ఇక జయలలితతో పాటు ఆమె స్నేహితులు కూడా క్రికెట్ ఎక్కువగా ఇష్టపడే వారట. ఇక ఆ తర్వాత హీరోయిన్గా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రోజుల్లో తమిళనాడులో ఏదైనా మ్యాచ్ జరిగింది అంటే చాలా అక్కడికి వెళ్లి తప్పకుండా ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించే వారట జయలలిత ఆమె స్నేహితులు. అంతేకాకుండా క్రికెటర్లను కలిసి వారి ఆటోగ్రాఫ్ లు ఫోటో గ్రాఫ్ లు కూడా తీసుకునే వారట. ముఖ్యంగా అప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే జయలలితకు మరింత పిచ్చి ఉండేదట. స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో ఎన్నో సార్లు ఆయనను కలిశారట జయలలిత. ఈ విషయాన్ని స్వయంగా జయలలిత ఒక వ్యాసంలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: