ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అందానికి కేరాఫ్ అడ్రస్ గా హాట్ నెస్ కి చిరునామాగా మారిపోయింది పూజా హెగ్డే. ఒకవైపు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ దర్శకుడు హీరో కాంబినేషన్ లో ఏదైనా సినిమా తెరమీదికి వచ్చింది అంటే చాలు అందులో హీరోయిన్గా పూజాహెగ్డే కన్ఫార్మ్ అయిపోతుంది. అంతలా ఈ అమ్మడు ప్రస్తుతం సూపర్ స్పీడ్ తో దూసుకుపోతుంది అని చెప్పాలి. ఒకవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు అటు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటుంది.




 ఇక అదే సమయంలో అటు బాలీవుడ్ లో కూడా తన లక్ ను పరీక్షించుకుంటూ అక్కడ మెల్లిమెల్లిగా స్టార్ హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది పూజా హెగ్డే. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తుంది. దీంతో ఈ అమ్మడికి మరింత క్రేజ్ వస్తుంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ రేంజ్ కు రావడానికి శృతి హాసన్ కారణమట. ఎలా అంటారా.. శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమా పూజా హెగ్డే చేయడం వల్లే ఇక కెరీర్ మలుపు తిరిగిందట.


 హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించి ఇక తన అందాలతో కూడా అందరినీ మైమరిపింప చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ముందుగా దువ్వాడ జగన్నాథం లో హీరోయిన్ ఆఫర్ శృతిహాసన్ దగ్గరికి వెళ్ళిందట.కానీ శృతి హాసన్ నో చెప్పడంతో ఇక చివరికి పూజా హెగ్డే నూ హీరోయిన్ గా ఈ సినిమాలో తీసుకున్నారట. ఒకవేళ శ్రుతిహాసన్ ఈ సినిమాకి నో చెప్పకపోయి ఉంటే పూజా హెగ్డే కెరియర్ ఎప్పటిలాగానే సాదాసీదాగా ఉండేదని స్టార్ హీరోయిన్ రేంజి సంపాదించడం కాస్త కష్టం అయ్యేది అన్న టాక్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: