టాలీవుడ్ ఇండస్ట్రీకి తన కృషితో, ప్రతిభతో ఎన్నో విజయాలను అందించి తెలుగు సినిమా ఖ్యాతిని నలుమూలలకు విస్తరింపజేసిన సినీ దిగ్గజాలలో కీర్తిశేషులు దాసరి నారాయణ రావు గారు ఒకరు. దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా సినిమా తల్లికి ఎన్నో సేవలను అందించిన దాసరి గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈయన మన మద్య లేకపోయినా మన హృదయాల్లో ఆయన రూపం, సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆయన గుర్తులు అందరి హృదయాలలో ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో దాసరి నారాయణ రావు గారు కుమారులు తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇపుడు తాజాగా ఆయన రెండవ తనయుడు దాసరి అరుణ్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. బంజారాహిల్స్ పోలీసులు ఈయన్ను అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం దాసరి అరుణ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న కారణంగా పోలీసులు అరుణ్ ని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ రోజు తెల్లవారు జామున 4 గంటల సమయంలో కార్ ఫాస్ట్ గా డ్రైవింగ్ చేస్తూ రెండు స్కూటర్లను ఢీ కొట్టడంతో భాదితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అరుణ్ ను అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. అనంతరం అరుణ్ ని ఉస్మానియా హాస్పిటల్ కి పంపి చెక్ చేయించగా దాసరి అరుణ్ మద్యం సేవించి కారు నడిపినట్లు నిర్దారణ అయ్యింది.

దాంతో పోలీసులు అరుణ్ పై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ 1988 ఐపీసీ సెక్షన్ 185 & 336 కింద కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రజలకు చెప్పాల్సిన ఇలాంటి పెద్ద వారి పిల్లలే విచక్షణ కోల్పోయి జనసమూహం ఉన్న ప్రాంతాలలో విచ్చలవిడిగా తాగి కారు డ్రైవ్ చేస్తూ ఉంటే ఎలా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో అరుణ్ కు బెయిల్ దొరుకుతుందా లేదా అన్నది ఇంకా తెలియలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: