వకీల్ సాబ్ అనే ఒకే ఒక చిత్రాన్ని విడుదల చేశాడు అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ విధంగా 2021 సంవత్సరం దాకా మూడు సంవత్సరాలుగా ఎలాంటి సినిమాను విడుదల చేయకుండా పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు అని చెప్పాలి. అయితే ఆ నిరుత్సాహానికి ఫలితంగా వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేసి వారి ఆకలి తీర్చాడు పవన్. అంతేకాదు ఆ తరువాత వరుసగా నాలుగు సినిమాలను అనౌన్స్ చేసి అందరినీ ఎంతగానో ఖుషీ చేశాడు.
ఇక ఆయన హీరోగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న పెద్ద హీరో సినిమా ఇదే కావడంతో ఆ నెలలో ఆయన భారీగా సందడి చేయడం ఖాయం అని తెలుస్తోంది. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండడం విశేషం. నిత్యా మీనన్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తొందర్లోనే ఈ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనుంది ఈ చిత్ర బృందం. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియుం అనే చిత్రానికి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.