న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో బ్లాక్ బస్టర్ క్లాసిక్ హిట్ మూవీగా నిలిచిన `శ్యామ్ సింగ రాయ్` పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ న్యాచురల్ స్టార్ నాని రెండు పాత్రల్లోనూ మెరిశాడని మరీ ముఖ్యంగా శ్యామ్ సింగ రాయ్ రోల్ లో సర్ ప్రైజ్ చేశాడని అలాగే సాయి పల్లవి దేవ దాసీ పాత్రలో చాలా అద్భుతంగా నటించిందని ఇప్పటి దాకా వీరిద్దరి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించిన సినిమా ఇదేనని ప్రశంసల వర్షం కురిపించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా చూసిన తరువాత హీరో న్యాచురల్ స్టార్ నాని సాయి పల్లవిలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇప్పటి దాకా వీరి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇదేనని ఈ సందర్భంగా ఈ ఇద్దరితో పాటు కృతిశెట్టి మడోన్నా సెబాస్టియన్ లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు రామ్ చరణ్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీని ప్రత్యేకంగా చూశారు.

ఆ విషయాన్ని హీరో నాని తెలియజేస్తూ మెగాస్టార్ తో కలిసి దిగిన ఓ సెల్ఫీ ఫొటోని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.శ్యామ్ ని ప్రేమించింది ఎవరో గెస్ చేయండి` అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు నాని. `శ్యామ్ సింగ రాయ్` సినిమాతో శ్యామ్ సింగ రాయ్ పాత్ర మీసం మెలేసే సీన్ చాలా హైలైట్ గా వుంటుంది. అదే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ చిరంజీవి నాని ఫొటోలకు పోజివ్వడం ఆకట్టుకుంటోంది. అంటే `శ్యామ్ సింగ రాయ్` సినిమా ఎలా వుందో మెగాస్టార్ చిరంజీవి ఈ చిన్న మేనరిజమ్ తో చెప్పారన్న మాట. నాని ట్వీట్ చేసిన ఈ ఫోటో స్టిల్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతూ సందడి చేస్తోంది. ఇదిలా వుంటే `శ్యామ్ సింగ రాయ్` సినిమా జనవరి 21 వ తేదీ న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.గత సినిమాలతో ప్లాప్స్ మూటగట్టుకున్న నాని శ్యామ్సింగరాయ్ సినిమాతో హిట్టు అందుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: