ఈ సంవత్సరం సంక్రాంతి రేస్ లో ఇద్దరు యంగ్ హీరోలు తమ అదృష్టాన్ని మొదటి సినిమాతో పరీక్షించుకున్నారు. ఈ ఇద్దరు హీరోలకు ఇండస్ట్రీకి సంబంధించి గాడ్ ఫాదర్స్ ఉండటంతో ఎవరికివారు తమ సినిమాలకు సంబంధించి చాల గట్టిగా ప్రమోట్ చేసుకున్నారు. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఎంటర్ అయిన ఆశిష్ రెడ్డి దిల్ రాజ్ సోదరుడి కొడుకు అయితే మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందినవాడు.


వీరిద్దరి సినిమాలను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించి బాగా ప్రమోట్ చేసారు. వాస్తవానికి ఈ రెండు సినిమాలకు సరైన టాక్ రాలేదు. కొంతలో కొంత ‘రౌడీ బాయ్స్’ టాక్ పర్వాలేదు అనిపించింది. దీనికి కారణం ఈమూవీలో ఉన్న హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ యూత్ కు బాగా నచ్చింది. అయితే కథలో ఏమి కొత్తదనం లేకపోవడంతో ఈమూవీ హిట్ అని ప్రచారం చేస్తున్నప్పటికీ దానిని అంగీకరించే స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన లేదు.


అయితే ఈ చిత్రంలో నటించిన ఆశిష్ రెడ్డీ నటనలో మంచి ఈజ్ తో పాటు డ్యాన్సులు, ఫైట్లలో చురుకుదనంతో బాగా హైలైట్ అయ్యాడు. అయితే గల్లా అశోక్ లుక్స్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో యూత్ కు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. అయితే ఎక్కడా కొత్త హీరో అన్న బెరుకు లేకుండా చాల ఈజీగా నటించడంతో ఇతడు భవిష్యత్ లో రాణించే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. అయితే ఈ సినిమా కథ మరీ వీక్ అయిపోవడంతో అశోక్ కష్టం వృథా అయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా సుకుమార్ శిష్యుడైన కాశి.. ఆశిష్ రెండో సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్టులో సుకుమార్ భాగ‌స్వామ్యం కూడా ఉంది అంటున్నారు. ఈసినిమా కూడ దిల్ రాజ్ నిర్మించబోతున్నారు. తన మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా అశోక్ మరో సినిమాను మహేష్ సొంత నిర్మాణ సంస్థలో నటిస్తాడు అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: