నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా భారీ బడ్జెట్ తో హిస్టారికల్ మూవీగా వస్తున్న క్రేజీ మూవీ బింబిసారా. ఈ సినిమాను వశిష్ట్ డైరెక్ట్ చేఏస్తుండగా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ 40 కోట్ల పైన బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎనౌన్స్ మెంట్ తో పాటుగా రిలీజ్ చేసిన బింబిసారా పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక ఈ సినిమా నుండి వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సినిమాను బాహుబలి, పుష్ప తరహాలోనే రెండు పార్టులుగా డివైడ్ చేస్తున్నారట. ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలకు రెండు పార్టులు అనేవి ఒక ఫ్యాషన్ గా మారింది.

బాహుబలిని ఫాలో అవుతూ రీసెంట్ గా వచ్చిన పుష్ప అదే రూట్ లో వెళ్లి సక్సెస్ కొట్టింది. పుష్ప ముందు ఒక పార్ట్ గానే అనుకున్నా సినిమా తీస్తూ పోగా రెండు పార్ట్ లకు సరిపడా కంటెంట్ వచ్చిందని అలా డిసైడ్ చేశారు. ఇక ఇప్పుడు అదె రూట్ లో బింబిసారా కూడా ఒక పార్ట్ లో మొత్తం కథ చెప్పడం కష్టమని రెండు పార్టులుగా సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బింబిసారా రెండు పార్టులు రిలీజ్ చేయడం అన్నది దాదాపు కన్ ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ ని ఫిబ్రవరి 4న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే పార్ట్ 1 కి సంబందించిన షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే వచ్చిన బింబిసారా ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై సూపర్ బజ్ ఏర్పాటు చేసింది. బింబిసారాలో కళ్యాణ్ రామ్ తన నటనతో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. సినిమా తప్పకుండా కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందిస్తుందని మేకర్స్ చెప్పుకుంటున్నారు. బింబిసారా కళ్యాణ్ రామ్ ఇమేజ్ ని పెంచడం పక్కా అని తెలుస్తుంది. మరి ఈ సినిమా పార్ట్ 1 ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.      

మరింత సమాచారం తెలుసుకోండి: