ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో యంగ్ హీరో తెరంగేట్రం చేశాడు. గల్లా ఫ్యామిలీ నుండి తొలి హీరోగా గల్లా అశోక్ హీరో సినిమాతో సంక్రాంతికి వచ్చాడు. ఆదిత్య శ్రీరాం డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్ర్కల్ రన్ సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న హీరో సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. గల్లా అశోక్ హీరో సినిమా అమేజాన్ ప్రైం లో డిజిటల్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 13న అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. డిజిటల్ రైట్స్ కూడా ఈ సినిమాకు మంచి ప్రైజ్ పలికిందని తెలుస్తుంది.

ఆదిత్య శ్రీరాం దర్శకత్వంలో అన్ని ఎమోషన్స్ ఉండి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాగా హీరో వచ్చింది. ఈ సినిమాతో గల్లా అశోక్ ప్రేక్షకులను మెప్పించాడని చెప్పొచ్చు. సినిమాలో ముంబై భామ నిధి అగర్వాల్ స్పెషల్ గా నిలిచింది. ఆమె ని ఏ ఉద్దేశంతో సినిమాలో పెట్టుకున్నారో ఆ ప్రకారం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. రోజు రోజుకి నిధి అగర్వాల్ క్రేజ్ డబుల్ అవుతుందని చెప్పొచ్చు. హీరో సినిమాకు అశోక్ బాగానే వర్క్ అవుట్ చేశాడని తెలుస్తుంది. స్క్రీన్ మీద అతని ప్రెజెన్స్ అతని కష్టాన్ని చూపిస్తుంది.

హీరో సినిమాతో గల్లా అశోక్ తన డెబ్యూని గ్రాండ్ గా ఇచ్చాడు. సినిమా థియేట్రికల్ రన్ లో వసూళ్లు కూడా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. హీరో సినిమా థియేటర్ లో మిస్సైన వారికి సినిమా రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారు. అమేజాన్ ప్రైం లో గల్లా అశోక్ సినిమా ఫిబ్రవర్ 13 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. అశోక్, నిధి అగర్వాల్ ల జోడీ.. సినిమా కామెడీ.. ఎమోషన్స్.. అన్ని సినిమాను ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాయి. ఈమధ్య థియేటర్ లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీల్లో సూపర్ హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్ కి వెళ్లడానికి సాహసించని కొందరు ఆడియెన్స్ అమేజాన్ ప్రైం లో హీరో సినిమాని ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: