‘మజిలీ’ లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఆతరువాత మాస్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాలని తీసిన ‘టక్ జగదీష్’ ఓటీటీ లో విడుదల అయినప్పటికీ ఆమూవీకి సగటు ప్రేక్షకుడి నుండి కాని అదేవిధంగా విమర్శకుల నుండి కానీ ప్రశంసలు రాలేదు. దీనితో శివ నిర్మాణ తన ఆశలు అన్నీ విజయ్ దేవరకొండతో తీయబోతున్న మూవీ పై పెట్టుకున్నాడు.


వాస్తవానికి కరోనా వేవ్ లు అడ్డు తగలకుండా ఉండి ఉంటే ఈపాటికి ‘లైగర్’ సినిమా విడుదల అయి శివ నిర్వాణ తో మూవీ ప్రారంభం అయి ఉండేది. అయితే ఇప్పుడు విజయ్ దృష్టి అంతా ‘లైగర్’ పైనే ఉంది. ఈమూవీ తనకు బ్లాక్ బష్టర్ హిట్ ఇస్తుందని అదేవిధంగా కలక్షన్స్ విషయంలో కూడ రికార్డులు క్రియేట్ చేస్తుందని విజయ్ గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.


అతడి ఊహల ప్రకారం ‘లైగర్’ సూపర్ హిట్ అయిన తరువాత వెంటనే మరో బ్లాక్ బష్టర్ పాన్ ఇండియా మూవీని చేయాలి అన్న ఉద్దేశ్యంతో సుకుమార్ ను లైన్ లో పెట్టాడు. ‘పుష్ప 2’ ఫినిష్ అయిన తరువాత విజయ్ సుకుమార్మూవీ ప్రారంభం అయ్యే  ఆస్కారం కనిపిస్తోంది. దీనితో శివ నిర్వాణ విజయ్ దేవరకొండ పై ఆశలు వదులుకుని సీనియర్ హీరో వెంకటేష్ తో ఒక మూవీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. వెంకటేష్ కూడ శివ నిర్వాణ చెప్పిన కథ నచ్చడంతో అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటున్నారు.


అయితే ఈమూవీ వెంకటేష్ నటించబోయే 75వ సినిమాగా సెట్స్ పైకి వెళుతుందా లేకుంటే అంతకు ముందు వెంకీ నటించబోయే 74వ సినిమాగా సెట్స్ పైకి వెళుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఈమూవీలో వెంకటేష్ 60 సంవత్సరాలు నిండిన ఒక డాక్టర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుత సమాజంలోని మానవ సంబంధాల చుట్టూ ఈమూవీ కథను శివ నిర్వాణ డిజైన్ చేసాడు అని అంటారు..




మరింత సమాచారం తెలుసుకోండి: