ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై తన టాలెంట్ తో, కామెడీ టైమింగ్ తో తెగ సందడి చేస్తున్న వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. ఎన్నో సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో ఉండి.. మొదటినుంచి అద్భుతమైన.. టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నాడు అవినాష్. ఇక అదే సమయంలో సినిమాలలో కూడా కొన్ని అవకాశాలను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా ఒక షోలో ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలను చూద్దాం.


అవినాష్ ముందుగా మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని స్టేజీల మీద కొంతమంది హీరో లాగా మాట్లాడి ఈవెంట్లలో  మెప్పు పొందాడు.. ఆ తర్వాత కొంతమంది జబర్దస్త్ కామెడీ అండ్ ల సహాయంతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో కొద్ది రోజులకే టీమ్ లీడర్గా ప్రమోషన్లు కూడా సంపాదించుకున్నాడు.. అయితే అలా జబర్దస్త్ లో ఉన్న సమయంలోనే ఎన్నో అవకాశాలు రావడంతో రెండు వైపులా మెయింటైన్ చేస్తూ ఉండేవాడు.. కానీ ఒకానొక సమయంలో జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పేశాడు.. అందుకు కారణం బిగ్ బాస్ హౌస్ లో ఆఫర్లు రావడమే. ఇక అలా జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కొన్ని లక్షల రూపాయలు చెల్లించాడు.

అయితే బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన టైటిల్ ని గెలుచుకో లేకపోయాడు ముక్కు అవినాష్.. కానీ బెస్ట్ కమెడియన్ గా బిగ్ బాస్ లో పేరు దక్కించుకున్నాడు.అయితే టైటిల్ గెలవలేకపోయినప్పటికీ.. స్టార్ మా లో మాత్రం అవకాశాలు బాగానే వెళ్ళు పడ్డాయి. స్టార్ మా లో కొన్ని స్కిట్ లు చేస్తూ.. ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ప్రసారమౌతున్న కామెడీ స్టార్స్ లో కొన్ని మార్పులు చేయడంతో అవినాష్ పరిస్థితి చాలా దిగజారి పోయినట్లుగా కనిపించాడు. నా అడ్డ అనుకున్నప్పటికీ వేరే ఈవెంట్ కు బయటికి వెళ్ళగానే నాలుగు స్కిట్లు వరకు నన్ను పక్కన పెట్టారని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: