టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అంచనాలకు అందని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అఖండమైన విజయం సాధించింది. డిసెంబర్ నెల 2వ తేదీన విడుదలైన అఖండ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా ఏకంగా 103 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం అనేది గమనార్హం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు కూడా విడుదల కాకపోవడంతో అఖండ సినిమాకు ఈ అరుదైన రికార్డు సొంతమైందని చెప్పాలి. ఇక బాహుబలి, సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురంలో, క్రాక్ సినిమాలు తర్వాత ఈ రికార్డు సాధించిన సినిమా అఖండ మాత్రమేనని తెలుస్తోంది.రాయలసీమలోని జిల్లాల్లో అఖండ సినిమా ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రన్ అవుతుంది.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కర్ణాటక ఇంకా మహారాష్ట్రలోని పలు థియేటర్లలో కూడా అఖండ మూవీ 50 రోజులు రన్ అవడం గమనార్హం. మరోవైపు ఈ సినిమా 200 కోట్ల రూపాయల క్లబ్ లో కూడా చేరింది. ఈ సినిమాకు ఇప్పటి దాకా 152 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వసూలు కాగా శాటిలైట్ ఇంకా డిజిటల్ అలాగే డబ్బింగ్ హక్కుల రూపంలో మిగిలిన మొత్తం వచ్చాయని సమాచారం.బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అయిన అఖండ సినిమా బాలయ్య అభిమానులకు ఎంతగానో నచ్చింది. అఖండ సినిమా ఇప్పటికీ పలు థియేటర్లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తుండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య బాబు అభిమానులు అఖండ సినిమా సక్సెస్ సంబరాలను జరుపుకుంటున్నారు. బాలయ్య బాబు కెరీర్ లో అఖండ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో నందమూరి అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: