ఏకంగా 103 కేంద్రాలలో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇది కేవలం టాలీవుడ్ లోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమ లోనే పెద్ద సంచలన విజయమని చెప్పొచ్చు. అఖండ జోరు అమెరికాలోను ఏమాత్రం తగ్గలేదు. అక్కడ రికార్డ్ స్థాయిలో ఏకంగా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్ మార్క్‌ను క్రాస్ చేసి బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సంపాదించిన రోజు నుండి ఎప్పుడెప్పుడు ఒ టి టి లో రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
అయితే ప్రేక్షకులు ఆశించిన విధంగానే అఖండ ఈ రోజు నుండి డిస్నీ హాట్‌స్టార్ లో సాయంత్రం 6 గంటల నుండి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. అయితే స్క్రీన్ ఏదైనా తగ్గేదేలే దబిడి దిబిడే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక నేటి నుండి ప్రతి ఫోన్ లోనూ అఖండ జ్యోతి నిత్యం వెలగాల్సిందే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై రికార్డులను సృష్టించిన అఖండ.. ఒ టి టి లో ఇంకెన్ని రికార్డులను తన పేరిట రాసుకుంటుందో చూడాలి.