ఒక దర్శకుడు సూపర్ హిట్ సినిమా చేసి తన తదుపరి సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోవడం జరిగితే అది తప్పకుండా ఆ దర్శకుడి యొక్క దురదృష్టం అని చెప్పాలి. అలా ఒకసారి జరిగితే పర్వాలేదు.. టైం బ్యాడ్ అనుకోవచ్చు. రెండుసార్లు అంటే ఏదో అలా జరిగింది అనుకుంటాం కానీ హిట్ కొట్టిన ప్రతిసారి తదుపరి సినిమా విషయంలో ఆలస్యం చేస్తూ ఉంటే. నిజంగా ఆ దర్శకుడు యొక్క దురదృష్టకరమని చెప్పాలి. ఎంతో బ్యాడ్ లక్ ఉంటే తప్పా ఇలా జరగదు.

అలా టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు హరీష్ శంకర్ సూపర్ హిట్ కొట్టిన కూడా తన తదుపరి సినిమా విషయంలో ఆలస్యం చేయడం ఆయన అభిమానులు ఎంతగానో నిరాశపరుస్తుంది. ఆయన మొదటి సినిమా నుంచి ఇదే తంతూ. హిట్ కొట్టిన తర్వాత ఏ హీరో కూడా హరీష్ శంకర్ ను నమ్మడం లేదు. నమ్మినా సమయం ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అలా గద్దల కొండ గణేష్ తో సూపర్ హిట్ సాధించిన ఈ దర్శకుడు తన తదుపరి సినిమా విషయంలో రోజు రోజుకూ జాప్యం చేస్తూ ఉండడం అందరినీ నిరాశపరుస్తుంది.
 
పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన హరీష్ శంకర్ కు ఆ తర్వాత తిరుగు లేదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయనకు సినిమా అవకాశాలు ఆలస్యంగా రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు కూడా భవదీయుడు భగవద్గీత సినిమా విషయంలో కూడా హరీష్ శంకర్ రోజురోజుకు ఆలస్యం చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో హరీష్ ఎరక్కపోయి అనుకున్నట్లు అయింది. ఎందుకంటే వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉండగా పవన్ ఇతర సినిమాల కారణాల వల్ల ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు కూడా తన బిజీ షెడ్యూల్ వల్ల ఈ చిత్రాన్ని పవన్ రెండు నెలలు పోస్ట్ ఫోన్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: