టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులకు నచ్చాలి అంటే అన్ని విధాలుగా వారిని సంతృప్తి పరచాలి. నటనతో మాత్రమే ప్రేక్షకులను సంతృప్తి పరచగలము అంటే అది సాధ్యపడదు. ఫిజిక్ విషయంలో  లుక్ విషయంలో మెకోవర్ విషయంలో నటన విషయంలో డాన్స్ విషయంలో ఇలా అన్ని విషయాలలో ప్రేక్షకులను సంతృప్తి పరిస్తే సదరు ప్రేక్షకుడు ఒక హీరోకి అభిమానిగా మారుతాడు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా చేస్తే తొందర్లోనే తన కెరియర్ ముగిసిపోవడం ఖాయం. ఆ విధంగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా మంచి సక్సెస్ ను సాధిస్తు ముందుకు వెళ్తున్నాడు విశ్వక్ సేన్. 

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న విశ్వక్ అంతకు ముందు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్ సినిమా చేసి మాస్ లో కొంత ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. హిట్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈ హీరో భారీ విజయాన్ని మాత్రం ఇప్పటివరకు తన ఖాతాలో వేసుకుని లేదనే చెప్పాలి.  దాంతో ఈ హీరో హిట్ కొట్టడానికి ఎన్నో ఆపసోపాలు పడుతున్నాడు అని చెప్పాలి.

ఇప్పుడు కూడా కొన్ని వెరైటీ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మరి వాటి ద్వారా ఆయన ఆయన హిట్ సంపాదించుకుంటాడో చూడాలి. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఈ హీరోపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశ్వక్ నటించే సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడానికి కారణం సినిమా బాగోక పోవడం కాదు విశ్వక్ బొద్దు గా ఉండడమే కారణం అని కామెంట్ పెట్టాడు. దీంతో ఆయన అభిమానులు విరుచుకుపడ్డారు. వాస్తవానికి ఇందులో కొంత నిజం ఉంది అని చెప్పాలి. హీరో అంటే సిక్స్ ప్యాక్ బాడీతో ఎంతో ఆకర్షణీయంగా ఉండాలి. కానీ విశ్వక్ మాత్రం కొంత బొద్దుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ రేంజ్ లో కనిపిస్తే ఏ హీరో నీ తెరపై చూడాలని అనుకోరు మన ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: