నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హిట్ మూవీ అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో బాలయ్య రైతుగా అలానే అఘోరాగా రెండు రకాల పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకాభిమానులని అలరించారు. శ్రీకాంత్, పూర్ణ, కాలకేయ ప్రభాకర్, సుబ్బరాజు, అయ్యప్ప పి శర్మ తదితరులు ఇందులో కీలక పాత్రలు చేసారు.
పక్కా మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు బోయపాటి ఈ సినిమాని తెరకెక్కించారు. అలానే ఈ సినిమాకి థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ అందరినీ ఎంతో ఆకట్టుకన్నాయి. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా సక్సెస్ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో ఆ వేడుకల్ని నిన్న హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో నిర్వహించింది యూనిట్. అయితే విషయం ఏమిటంటే అఖండ మూవీ నేటి సాయంత్రం నుండి ప్రముఖ ఒటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారంకానుంది.

కాగా నేడు జనవరి 21 సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం అనగా జనవరి 23 అర్ధరాత్రి వరకు సినిమాని వీక్షించిన వారిలో 500 మంది లక్కీ విన్నర్స్ ని ఎంపిక చేసి వారిని స్వయంగా బాలయ్యతో కలిసే అవకాశం కల్పిస్తున్నారు డిస్నీ హాట్ స్టార్ వారు. నేడు కొద్దిసేపటి కృతం ఈ ప్రకటన రావడంతో ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా అఖండ మూవీ చూసేయండి బాలయ్యని కలిసే అదృష్టాన్ని పరీక్షించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: