హీరో సిద్ధార్థ్ మరోసారి వివాదంలో పడ్డాడు. ఇటీవల ట్విట్టర్‌లో సైనా నెహ్వాల్‌లో ఆరోపణలు చేయడం పెద్ద దుమారమే రేపింది. ఈ ట్విట్‌పై హీరో సిద్ధార్థ్‌ కు చెన్నై పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హీరో సిద్ధార్థ్ ను ఎలా విచారణ చేపట్టాలని పోలీసులు తల పట్టుకుంటున్నారు. కాగా, సినీ ఇండస్ట్రీలో అంతగా రాణించలేకపోతున్న సిద్ధార్థ్.. ఇటీవల ఆరోపణలు చేస్తూ వివాదాల్లో నిలుస్తున్నారు.


కాగా, ఇటీవల జనవరి 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రముఖ బ్యాడ్మింటర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ స్పందించారు. ‘మన దేశ ప్రధానికే భద్రత లేదు.. దేశవాసుల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు.’ అని ఆమె ట్విట్ చేశారు. ఈ ట్విట్‌కు హీరో సిద్ధార్థ్ రీట్విట్ చేయడం పెద్ద రచ్చ నెలకొంది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్‌ను వెంటనే డిలీట్ చేయాలని ‘ట్విట్టర్ ఇండియా’కు లేఖ కూడా రాసింది.


సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతర పోస్టు చేశాడని, దీనిపై మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అయితే సైనా నెహ్వాల్‌పై ఆరోపణలు చేయడంతో సిద్ధార్థ్ పై ముప్పేట్ దాడి జరిగింది. దీంతో సిద్ధార్థ్ ఆమెకు క్షమాపణ కూడా కోరారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ..‘‘ డియర్ సైనా నెహ్వాల్.. నేను చేసిన రీ ట్విట్‌ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు మహిళలు అంటే గౌరవం ఎక్కువ. మిమ్మల్నీ కించపరిచేలా నేను ట్విట్ చేయలేదు. లింగ సమానత్వాన్ని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మీకు ఆ ట్విట్‌ వల్ల ఎలాంటి ఇబ్బంది కలిగించినా నన్ను క్షమించండి.’’ అని హీరో సిద్ధార్థ్ పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం చెన్నై పోలీసులు హీరో సిద్ధార్థ్ పై త్వరలో విచారణ జరుపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: