ప్రస్తుతం అటు సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక లేటెస్ట్ గా ఆయన నటించిన అఖండ సినిమా మంచి హిట్ కొట్టి ఎప్పటినుండో కెరీర్ పరంగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అయనకి పెద్ద బ్రేక్ ని అందించింది. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ప్రస్తుతం ఆహా ఓటిటి మాధ్యమంలో బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అందరి నుండి బాగా స్పందన అనుకోవడంతో పాటు అత్యధిక వ్యూస్ కూడా రాబడుతోంది.

ఇటీవల ఈ షో ఇండియా లోని టాప్ 10 షోల్లో ఒకటిగా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే విషయం ఏమిటంటే, లేటెస్ట్ గా ఈ షో యొక్క తాజా ఎపిసోడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి సందడి చేసారు. ఇటీవల ఆయన ఎంట్రీ కి సంబంధించి ఒక చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసిన ఆహా యాజమాన్యం, కొద్దిసేపటి క్రితం ఈ క్రేజీ ఎపిసోడ్ యొక్క ప్రోమోని రిలీజ్ చేసింది .ఇక ప్రోమోలో అటు బాలయ్య ఇటు మహేష్ బాబు ఇద్దరూ కూడా తమ మార్క్ సెటైర్ డైలాగ్స్ తో అదరగొట్టారు.

మధ్యలో మహేష్ ప్రస్తుతం వెయ్యికి పైగా గుండె ఆపరేషన్స్ చేయించిన చిన్నారుల్లో ఇటీవల ఆపరేషన్ జరిగిన ఒక చిన్నారిని, అతడి తల్లితండ్రుల్ని షోకి పిలిపించడం, అంతటి గొప్ప బృహత్కార్యం చేస్తున్న మహేష్ కి బాలయ్య ప్రత్యేకంగా అభినందనలు తెల్పడం షోలో అందరినీ కదిలించింది. మొత్తంగా మహేష్ తో బాలయ్య అన్ స్టాపబుల్ గా చేసిన ఈ ఎపిసోడ్ అదిరిపోయేలా సాగినట్లుగా ఈ ప్రోమోని బట్టి చూస్తే మనకు అర్ధం అవుతుంది. కాగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ఈ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ గా ఫిబ్రవరి 4న ఆహా లో ప్రసారం చేయనున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఎంత మేర వ్యూస్ ని క్రేజ్ ని ఆదుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: