ఇప్పుడు తెలుగు ఆడియన్స్ అందరితో పాటు అటు పలు ఇతర భాషలు సహా నార్త్ ఆడియన్స్ లో కూడా ఎంతో ఫేమస్ అయిన నటి రష్మిక మందన్న. ఫస్ట్ తెలుగు మూవీ ఛలోతో సూపర్ హిట్ కొట్టిన రష్మిక, ఆ తరువాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, అలానే ఇటీవల పుష్ప ఇలా వరుసగా తన కెరీర్ లో దాదాపుగా చాలా సినిమాలతో మంచి సక్సెస్లు బాగా క్రేజ్ అందుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ నటిగా టాప్ స్థానంలో కొనసాగుతున్నారు రష్మిక. మరోవైపు ఆమె టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ గా కూడా నిలిచినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీతో పాటు, పుష్ప సీక్వెల్ అయిన పుష్ప ది రూల్ లో కూడా ఆమె నటిస్తున్నారు. అవి మాత్రమే కాకుండా అటు కన్నడ, తమిళ్, హిందీలో కూడా రష్మిక కి సూపర్ గా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నటిగా తొలి సినిమా నుండి తన ఆకట్టుకునే అందం, అభినయంతో ముఖ్యంగా యువత మనస్సులో మంచి పేరు సంపాదించుకున్న రష్మిక అటు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ సినిమాలు, వ్యక్తిగత విషయాలను గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఆ విధంగా వరుస ఛాన్స్ లతో దూసుకెళ్తున్న ఈ భామ ఖాతాలో మరొక బడా టాలీవుడ్ స్టార్ నటుడి సినిమా అవకాశం వచ్చి చేరిందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. అతి త్వరలో ఒక స్టార్ హీరోతో ప్రముఖ యువ దర్శకుడు నిర్మించనున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైందని, ఇటీవల ఈ సినిమా స్టోరీ ఎంతో నచ్చిన రష్మిక వారికి డేట్స్ కేటాయించారని, త్వరలోనే ఆ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నాయని టాక్. అయితే ఇంకోవైపు ప్రచారం అవుతున్న వార్తలను బట్టి రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి త్వరలో తీయనున్న సినిమాలోనే ఆమె హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నట్లు చెప్తున్నారు. అయితే దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: