పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులోనూ రిమెక్ సినిమాలను ఎక్కువగా చెస్తున్నారు. ఇప్పుడు పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ సినిమాలతో పవన్ బిజీగా ఉన్నాడు. అయితే చేతిలో సినిమాలు ఉన్నా కూడా పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నాడు. అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది..


జన సేన పార్టీ అధినేతగా పవన్ రాజకియల్లొ కూడా చురుగ్గా ఉన్నారు.ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకో పక్క రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. లేటెస్ట్ గా “భీమ్లా నాయక్” సినిమాని కంప్లీట్ చేసే పనిలో పడ్డ పవన్ దీని తర్వాత ఒక ప్లాన్ లో వున్నట్లు ఇండస్ట్రీ లో ఒక వార్త షికారు చెస్తుంది.. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. దాదాపు అన్నీ కార్యక్రమాలను కూడా ముందే పూర్తీ చేసినట్లు తెలుస్తుంది.


ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా పూర్తీ చేసిన తర్వాత కొద్ది రోజులు సినిమాకు గ్యాప్ తీసుకొవాలని అనుకున్నట్లు తెలుస్తుంది. భీమ్లా నాయక్ షూట్ అయ్యాక పవన్ కొన్నాళ్ళు తన పాలిటిక్స్ పై దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. ఆల్రెడీ ఆ పనుల్లో కూడా ఉన్నారట ఏపీలో ప్రతి రాజకీయ నేతతోని వీడియో కాన్ఫిరెన్స్ లు నిర్వహిస్తూ పార్టీని ఎపిలో మరింత స్ట్రాంగ్ గా మార్చెందుకు పవన్ ప్లాన్ లో వున్నట్లు తెలుస్తుంది..ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది అలాగే మళ్ళీ మిగతా సినిమాలు షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే అంశాల పై క్లారిటీ రాలేదు.. ఈ వార్తల పై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి..భీమ్లా నాయక్ సినిమా తర్వాత రెండు సినిమాలకు పవన్ సైన్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: