హీరో విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఒక్క సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. దాంతో వరుస సినిమాలో నటించె అవకాశాలను అందుకుంటు కెరియర్ లో దూసుకుపోతోన్నాడు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను సినీ ఇండస్ట్రీ కి అందిచాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ కూడా విజయ్ కు అంతగా పేరును తీసుకురాలేదు..కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ ఇప్పుడు మరో భారీ బడ్జెట్ సినిమా లో నటిస్తున్నారు.. ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతోంది.


పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెకుతున్న లైగర్ మూవీని పూరీ కంటెంట్స్ బ్యానర్ తో పాటు ధర్మ ప్రోడక్షన్స్ కలిపి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో దాదాపు ఐదు భాషల్లో లైగర్ రిలీజ్ కాబోతోంది.. భారీ బడ్జెట్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. దానికోసం విజయ్ భారీగానె కష్టపడుతున్నాడు.. అతని తగిన విధంగా భారీ రెమ్యునరేషన్ ను అందుకున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ కు 20 కోట్లకు పైనే ముట్టు జెప్పుతున్నట్టు తెలుస్తోంది.


దాదాపు చిత్రీకరన పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొనేపనిలో వుంది.బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఆడిపాడుతోంది. ఈమూవీలో బాక్సార్ గా కనిపిస్తున్నాడు విజయ్. ఒక పక్కా మాస్ ముంబయ్ ఛాయ్ వాలా పాత్రలో విజయ్ దేవరకొండు నటిస్తున్నాడు. పేద చాయ్ వాలా బాక్సార్ గా సాధించిన విజయాన్ని లైగర్ లో చూపించనున్నారు. అయితే సినిమాలో మరింత జోష్ పెంచెందుకు పూరిజగన్నాథ్ మరో ప్లాను వేశాడు. ఐటమ్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ తో చేయించాలనే ప్లాన్ లో వున్నాడు. అందుకోసం ఏ హీరోయిన్ ను దించుతాడో అనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: