యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ప్రభాస్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉన్నా ప్రస్తుతం కొవిడ్ పరిస్థితుల వల్ల వాయిదా పడ్డది. ఓ పక్క రాధేశ్యామ్ మరోపక్క ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా రిలీజ్ డేట్ కోసం ప్రాకులాడుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు సంబందించి లేటెస్ట్ గా రెండు రిలీజ్ డేట్లు ప్రకటించి రాధేశ్యామ్ టీం ని కన్ ఫ్యూజన్ లో పెట్టారు. రాధేశ్యామ్ సినిమాని కూడా మార్చి 3 వ వారం లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అప్పుడున్న కొవిడ్ పరిస్థితులను బట్టి ఈ సినిమాల రిలీజ్ లు ఉంటాయని తెలుస్తుంది.

ఇదిలాఉంటే రాధేశ్యామ్ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ గురించి మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్ ఒకటి బయటక్ వచ్చింది. సినిమాలో హీరో విక్రమాదిత్య, హీరోయిన్ ప్రేరణలతో ఓ అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ లో ప్రభాస్, పూజా హెగ్దేలు రెచ్చిపోయారట. అయితే ఈ సాంగ్ చూసేందుకు విజువల్ గా ఉన్నా అందులో ప్రభాస్, పూజా హెగ్దేలని గ్రాఫిక్స్ తో చూపించారట. రాధేశ్యామ్ కోసం ఇపటికే ఛాలా డేట్లు ఇచ్చినా పూజా హెగ్దే రొమాంటిక్ సాంగ్ కోసం పెద్దగా ఆసక్తి చూపలేదట. డేట్స్ అడ్జెస్ట్ కాలేదని చెప్పడంతో గ్రాఫిక్స్స్ సాయంతో ఈ సాంగ్ పూర్తి చేశారట. ప్రభాస్ కూడా రొమాన్స్ అంటే చాలా సిగ్గుపడతాడు. అందుకే రాధేశ్యామ్ లోని రొమాంటిక్ సాంగ్ ని అలా కానిచ్చేశారని టాక్.

ప్రభాస్ పూజా హెగ్దే జోడీ రాధేశ్యామ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని తెలుతుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా భారీ అంచనాలతో క్రేజీ మూవీగా రాధేశ్యామ్ వస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో సూపర్ బజ్ ఏర్పరచుకోగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా చేస్తున్నాడని అందరికి తెలిసిన విషయమే. వీటితో పాటుగా లైన్ లో ప్రాజెక్ట్ కె, ప్రశాంత్ నీల్ మూవీ, మారుతి సినిమా అలా మరో 3 సినిమాలు లైన్ లో పెట్టాడని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: