అలనాటి హీరోయిన్ జయసుధ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈమే హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించింది.. కానీ అందులో మాత్రం సక్సెస్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో ఎందుకు సక్సెస్ కాలేదని విషయాన్ని మాత్రం తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు వాటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

ఇక ఈ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ.. చిరంజీవి నటించిన"హ్యాండ్సప్"మూవీ గురించి తెలుపుతూ.. జయసుధ నిర్మాతగా మారినప్పటినుంచి ఆమె తీసిన సినిమాలు.. ఆత్మ బంధువులు, కాంచన సీత బాగానే సక్సెస్ అయ్యాయట.. ఇక అంతే కాకుండా ఈ సినిమాలతో లాభాలు కూడా వచ్చాయట. ఇక దాంతో జయసుధ హిందీలో కూడా ఒక మూవీ నిర్మించాలని జితేంద్ర హీరోగా.." మేరా పతి సిర్ప్ మేరా హే"అనే సినిమాకి నిర్మాతగా చేసిందట.. కానీ ఆ సినిమా కూడా ఎన్నో నష్టాలను తెచ్చి పెట్టింది.. ఇక ఈ సినిమా తర్వాత వింత కోడలు అనే మూవీని చేయడంతో పూర్తి నష్టాలలో కూరుకుపోయింది జయసుధ.. అలా నెమ్మదిగా నష్టపోతూ వచ్చానని తెలియజేసింది.. చివరిగా హాండ్సప్ అనే మూవీని నిర్మించామని.. అందులో గెస్ట్ రోల్ గా చిరంజీవి కూడా ఒక చిన్న పాత్రలో చేశానని తెలియజేసింది.సినిమా విడుదలయ్యే వరకు అందులో చిరంజీవి ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదని తెలియజేసింది జయసుధ. ఒకవేళ ఆయన పోస్టర్ వేసి ఉంటే మంచి కలెక్షన్లు రాబట్టునేమో అనుకుంటే.. చిరంజీవి పోస్టర్ వేస్తానంటే వద్దన్నారట.. అప్పటివరకు తెలుగు సినిమాలలోనే ఎవరు స్టార్ హీరోలు గెస్ట్ రోల్ పాత్రలు చేయలేదట.. ఒకవేళ ఆ పోస్టర్ చూసి ఆయన అభిమానులు పెద్ద క్యారెక్టర్ అనుకొని థియేటర్ కు వస్తే.. అది చిన్న పాత్ర అయితే ఫీలవుతారని చిరంజీవి చెప్పడంతో పోస్టర్లు అతికించి లేదట. ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో భారీగా నష్టపోయానని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: