భీమ్లా నాయక్. మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ కి ఇది రీమేక్. సినిమాలో రెండు క్యారెక్టర్లు ఉంటాయి. పైకి ఇద్దరూ హీరోలుగా ఉంటారు, ఇద్దరూ విలన్లుగా కనిపిస్తారు. కానీ రెండూ పోటాపోటీగా ఉండే పాత్రలు. అందుకే ఆ పాత్రల పేర్లనే సినిమాకి కూడా పెట్టారు. అంటే ఇద్దరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ తెలుగులో మాత్రం ఒకే పాత్ర డామినేషన్ ఉంటుంది. పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్ నే సినిమాకి పెట్టారు. ఆ పేరుతోనే సినిమాకి పబ్లిసిటీ జరుగుతోంది. ఇక రెండో పాత్రలో ఉన్న రానాకి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనిపించడంలేదు.

బాహుబలిలో రానా పూర్తిగా విలన్ క్యారెక్టర్. అందుకే ఆ సినిమాలో రానా పాత్ర పేరు భళ్లాలదేవకి సినిమా టైటిల్ లో చోటు లేదు అనుకోవచ్చు. కానీ భీమ్లా నాయక్ లో రానాది విలన్ పాత్ర కాదు. కానీ మలయాళంలో ఉన్న పాత్ర పేరుని తెలుగులోకి వచ్చే సరికి తీసి పక్కనపెట్టారు. ఇప్పుడు కొత్తగా సినిమా లెంగ్త్ కూడా తగ్గిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మలయాళ అయ్యప్పనుమ్ కోషియుమ్ లాగా తెలుగు భీమ్లా నాయక్ పెద్ద సినిమా కాదట. తక్కువ నిడివితోటే దీన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారట.

రానా పాత్రకు కటింగ్ పెట్టారా..?
టైటిల్ లో పేరు తీసేసినట్టే.. సినిమాలో కూడ రానా పాత్ర పరిధి తగ్గించబోతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇది కేవలం పవన్ కల్యాణ్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని తీస్తున్న సినిమా. అందుకే పవన్ ని హైలెట్ చేస్తూ పాటలు, ఫైట్లు, టైటిల్.. అన్నీ అలాగే ఉన్నాయి, ఉంటాయి కూడా. అయితే మలయాళ సినిమా కేవలం ఇద్దరు వ్యక్తుల ఘర్షణను చూపించింది. వారి ఇగో ప్రాబ్లమ్స్ తో సమస్యను ఎలా పెద్దది చేసుకున్నారు, ఆ తర్వాత ఎలా రియలైజ్ అయ్యారనే విషయాన్ని హైలెట్ చేశారు. పాత్రల మధ్య సంఘర్షణే ఆ సినిమాకి హైలెట్.

తెలుగులోకి వచ్చే సరికి తెలుగు మార్కెట్ కి అనుగుణంగా దీనిలో మార్పులు చేర్పులు చేశారు. పవన్ కల్యాణ్ పాత్రను హైలెట్ చేస్తున్నారు. అయితే సినిమా విడుదలైతేనే దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి రానా పాత్ర నిడివి తగ్గించారని, దీంతో టోటల్ గా సినిమా నిడివి తగ్గించినట్టయిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: