సొనాక్షి సిన్హా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఈమె అసలు హీరోయిన్‌ కటౌట్‌ కాదనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే పవర్‌ఫుల్‌ రోల్స్‌తో ఈ విమర్శలన్నిటికి సమాధానం చెప్పింది సొనాక్షి. కానీ 'దబాంగ్2' తర్వాత సొనాక్షి ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసినా బ్లాక్‌బస్టర్‌ రాలేదు. 'దబాంగ్3' తర్వాత అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో 'కకూద, డబుల్ ఎక్స్ఎల్' పైనే ఆశలు పెట్టుకుంది సొనాక్షి. ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ట్రీకి వచ్చిన పరిణీతి చోప్రా, కెరీర్‌ బిగినింగ్‌లోనే యూత్‌కి కనెక్ట్ అయ్యింది. 'ఇషక్‌జాదే, శుద్ద్‌ దేశీ రొమాన్స్' సినిమాలతో గ్లామర్‌ హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. దీంతో ఈ హీరోయిన్‌ టాప్‌లీగ్‌లో చేరుతుందని అంతా అనుకున్నారు. కానీ పరిణీతీకి నాలుగేళ్లుగా సరైన హిట్‌లేదు. ప్రీవియస్ మూవీస్ 'సందీప్‌ ఔర్‌ పింకీ పరార్, సైనా' అట్లర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ డిజాస్టర్స్‌తో పరిణీతి కెరీర్‌ కష్టాల్లో పడింది.

ప్రభాస్‌ 'బాహుబలి' తర్వాత 'సాహో'ని పాన్ ఇండియన్ మూవీగా మార్చగానే, హిందీ మార్కెట్ కోసం శ్రద్ధా కపూర్‌ని తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. శ్రద్ధా కపూర్‌కి బాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాట్లేదు. 'బాఘీ3' తర్వాత శ్రద్ధ ఒకే ఒక్క సినిమాకి మాత్రమే సైన్ చేసింది. దీంతో శ్రద్ధా కపూర్‌ జర్నీ ఎండ్‌కి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్ ఉంటే ఈజీ ఎంట్రీ దొరుకుతుంది. ఆ సపోర్ట్‌తో రెండు మూడు సినిమాలొస్తాయి. అయితే కెరీర్‌ బిజీగా ఉండాలన్నా, స్టార్‌ హీరోయిన్‌ కావాలన్నా హిట్స్‌ ఉండాలి. ఆడియన్స్‌ని మెప్పించే టాలెంట్‌ ఉండాలి. అప్పుడే స్టార్డమ్‌ వస్తుంది. ఈ స్టార్డమ్‌ కోసమే చాలామంది హీరోయిన్లు టఫ్ ఫైటింగులు చేస్తున్నారు.

వాణీ కపూర్‌ ఎంట్రీ ఇవ్వడమే యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో మూడు సినిమాలకి సైన్ చేసింది. ఈ మూడు సినిమాలు అగ్రిమెంట్ అయిపోయాక కూడా యశ్‌రాజ్‌ బ్యానర్‌ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే వాణీకి ఆదిత్యాచోప్రా గాడ్‌ఫాదర్‌లా వరుస ఆఫర్స్ ఇస్తున్నా హిట్స్‌ మాత్రం రాట్లేదు. 'వార్, బెల్‌ బాటమ్' లాంటి సినిమాలతో ఒకే అనిపించుకున్న వాణీ కపూర్‌కి క్రేజీ ఆఫర్స్ రావడం లేదు. 'దంగల్' టైమ్‌లో ఫాతిమా సనా షేక్‌కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమిర్‌ ఖాన్‌తో 'థగ్స్‌ ఆఫ్ హిందుస్థాన్' చెయ్యగానే స్టార్ హీరోయిన్ అవుతుందనే బజ్‌ వచ్చింది. కానీ ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యాక ఫాతిమా స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి. 'లూడో, సూరజ్‌ పే మంగళ్ భరీ, అజీబ్‌ దాస్తాన్స్' ప్లాపులతో ఫాతిమా కెరీర్‌ స్లో అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: