కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో గా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తి గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పునీత్ రాజ్కుమార్. ఒకవైపు స్టార్ హీరోగా ప్రేక్షకులను అలరించిన పునీత్ రాజ్కుమార్ మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి దేవుడిగా మారిపోయారు అనే చెప్పాలి. పేద విద్యార్థులకు స్కూల్లు కట్టించడం మెరుగైన వైద్యం కోసం హాస్పటళ్లు కట్టించడం కేవలం పునీత్ రాజ్కుమార్ కె సాధ్యమైంది అని చెప్పాలి. ఇలా ఎంతో మంది పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పునీత్ రాజ్కుమార్ గత ఏడాది అక్టోబర్ 19వ తేదీన గుండెపోటుతో హఠాత్ మరణం చెందడం  అభిమానులందరినీ విషాదంలో ముంచెత్తింది.



 పునీత్ రాజ్కుమార్ భౌతికంగా లేరు అన్న విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అనే చెప్పాలి. కాగా పునీత్ రాజ్కుమార్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూనే ఇప్పటి వరకు ఎంతో మంది భిన్నంగా నివాళులు అర్పించిన సందర్భాలు చూశాం. ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించేందుకు సిద్ధమైంది. పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన లా, ఫ్రెంచ్ బిర్యానీ, కాలువ దారి, మాయాబజార్, యువరత్న సినిమాలను ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు కూడా అభిమానులందరికీ కూడా ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది.


 అంటే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం లేని వారు సైతం ఇక పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ సినిమాలను ఉచితంగా చూసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా పునీత నిర్మాణ సంస్థ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న మూడు కొత్త సినిమాలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, వన్ కట్ టూ కట్, ఫ్యామిలీ ప్యాక్ లాంటి సినిమాలను కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ఈ సంస్థ ప్రకటించింది. ఇలా పునీత్ రాజ్ కుమార్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటు ఘనంగా నివాళి అర్పించింది అమెజాన్ ప్రైమ్ సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: