ద మోస్ట్ అవైటింగ్ మూవీ rrr నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. అభిమానులంతా  ఎప్పుడెప్పుడా అని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ విజువల్ వండర్ విడుదల కోసం  రెండు డేట్ లను లాక్ చేసింది rrr టీమ్. దీనికి సంబంధించి మేకర్స్ అధికారికంగా ఓ నోట్ ను విడుదల చేశారు. కరోనా మహమ్మారి తగ్గి, పరిస్థితులు మెరుగ్గా ఉండి, థియేటర్లు 100 శాతం కెపాసిటీతో రన్ అయితే ఈ సినిమా మార్చి 18న విడుదలవుతుందని, లేకపోతే ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల అవుతుందని తెలిపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో అదే రోజు సినిమా విడుదల కానుంది.

 తెలుగు సినిమా హిస్టరీ లో ఒక సినిమాకు రెండు తేదీలను ఖరారు చేస్తున్న ఏకైక మూవీ rrr కావచ్చు. భారీ అంచనాలతో సిద్ధమైన rrr సినిమా ను మొదటినుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. సినిమా విడుదల చేస్తామని మొదటిసారి అనౌన్స్ చేసినప్పటి నుండి వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. జులై 30, 2020rrr సినిమా రిలీజ్ చేస్తామంటూ మొదటిసారి రాజమౌళి ప్రకటించారు కానీ షూటింగ్ ఇబ్బందులతో ఆ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. జూన్ 8, 2021 న విడుదల చేస్తామంటూ రెండోసారి ప్రకటించారు. కానీ కరోనా దెబ్బకు ఆ డేట్ కూడా మిస్సయ్యింది. తర్వాత అక్టోబర్ 12, 2021న రిలీజ్ చేస్తామంటూ మూడోసారి ప్రకటించారు. కానీ సెకండ్ వేవ్ తో ఆ తేదీ కూడా సినిమా రిలీజ్ కాలేదు. కరోనా కష్టాలను దాటుకొని సినిమా పూర్తి చేసుకొని జనవరి 7,2022 న రిలీజ్ కు rrr ను రెడీ చేశారు రాజమౌళి. దాని కోసం కొన్ని రోజులుగా భారీగా ప్రమోషన్ కూడా చేశారు.

ముంబై, బెంగళూరు, చెన్నై, కేరళలో కూడా హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళి ఫ్రీ రిలీజ్ ఈవెంట్  లలో పాల్గొన్నారు. ప్రమోషన్స్ కే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. దీంతో రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా కళ్లముందు కనువిందు చేయడం పక్క అని  అంతా ఎక్స్పెట్ చేశారు. కానీ rrr టీమ్ ఆశలకు ఈసారి ఓమిక్రాన్ వేరియంట్ గండి కొట్టింది. దేశంలో కేసులు భారీగా పెరగడం,పలు రాష్ట్రాల్లో నిబంధనలు అమలు చేయడంతో rrr మూవీని వాయిదా వేయక తప్పలేదు. ఈ వాయిదాల పర్వాన్ని గమనించే ఈసారి ముందు జాగ్రత్తగా రెండు తేదీలను ప్రకటించింది rrr టీమ్. మరి ఈసారైనా ఈ సినిమా అనుకున్న డేట్ కు విడుదల అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: