ఇక ఇటీవల కాలంలో ఏకంగా గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా నేను రెడీ అంటూ చెప్పిస్తుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది. ఇకపోతే రష్మిక మందన ఇటీవలే పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన హీరో తో నటించిన విషయం మీకు తెలుసా అంటే. అవునా రష్మిక తన కంటే ఇరవై ఒక్క ఏళ్ల పెద్ద అయినా హీరో తో నటించిందా అని షాక్ అవుతున్నారు కదా.
అంతలా షాక్ కావాల్సిన పనిలేదు ఎందుకంటే ఆ సినిమా మన అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఏదో కాదు సరిలేరు నీకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే మహేష్ బాబుతో పోల్చిచూస్తే రష్మిక మందన వయసు దాదాపు 21 ఏళ్లు తక్కువ. ఇలా తనకంటే 21 ఏళ్లు పెద్దవాడైన మహేష్ బాబుతో కలిసి నటించి మంచి విజయాన్ని అందుకుంది రష్మిక మందన. కేవలం రష్మిక మాత్రమే కాదు ఇలాఎంతో మంది యువ హీరోయిన్లు సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తూ వారికి పర్ఫెక్ట్ జోడి అని పెంచుకుంటూ ఉండటం గమనార్హం.