మాయ చేసావే సినిమాతో టాలీవడ్ పరిశ్రమకి హీరోయిన్ గా అడుగుపెట్టి ఆ మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు సమంత రూత్ ప్రభు. స్వతహాగా కేరళకు చెందిన సమంత, తెలుగు భాష, ఇక్కడి ప్రేక్షకులంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్తుంటారు. ఇక అక్కడి నుండి వరుసగా అనేక సినిమా ఛాన్స్ లు అందుకున్న సమంత, ఆపైన మహేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇలా దాదాపుగా టాలీవుడ్ లోని అందరూ స్టార్ హీరోల సరసన పలు సక్సెస్ఫుల్ సినిమా ఛాన్స్ లు అందుకున్నారు. అలానే అటు తమిళ్ లో కూడా ఆమెకు ఎన్నో పెద్ద సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇక తన తొలి సినిమా హీరో నాగచైతన్యని నాలుగేళ్ళ క్రితం ప్రేమించి పెద్దలని ఒప్పించి మరీ వివాహం చేసుకున్న సమంత, ఇటీవల ఆయన నుండి విడిపోతున్నట్లు తెలిపారు. ఇక విడాకుల తరువాత ప్రస్తుతం తన కుటుంబసభ్యులతో కలిసి కొత్తగా హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ఇంట్లో సమంత నివాసం ఉంటున్నట్లు సమాచారం. మరోవైపు ఇదివరకుతో పోలిస్తే ఆమెకు మరింతగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల పుష్ప మూవీలో ఆమె చేసిన ఊ అంటావా మామ స్పెషల్ సాంగ్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే.

మరోవైపు గుణశేఖర్ తో శాకుంతలం అలానే యశోద అనే మరొక భారీ సినిమా చేస్తున్న సమంత, వారం రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ ల లేటెస్ట్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యారని, అలానే తన డేట్స్ ని ఆమె ఆ మూవీ యూనిట్ కి కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సినిమాలో తొలుత పూజా హెగ్డే నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన యూనిట్, ప్రస్తుతం ఆమె స్థానంలో సమంతని తీసుకున్నారు అనేది ఆ వార్త యొక్క పూర్తి సారాంశం. అయితే లేటెస్ట్ గా సమంత సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అసలు మహేష్, త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించి ఆమెకి ఎటువంటి ప్రపోజల్ రాలేదని, అదంతా ఒట్టి పుకారు మాత్రమే అని వారు కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇక సమంత అతి త్వరలో ఒక హాలీవుడ్ సినిమా కూడా చేయబోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: