టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కొదువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు కోట శ్రీనివాసరావు అన్ని రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించేవారు. అంతకుముందు కైకాల సత్యనారాయణ, అంతకుముందు గుమ్మడి వంటి నటులు తెలుగు సినిమా పరిశ్రమకు క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత  వచ్చేలా చూసుకోలేదు. అయితే ఇటీవల కాలంలో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత ఏర్పడింది అని మన దర్శక నిర్మాతలు ఇతర భాషల నుంచి ఇంపోర్ట్ చేసే విధానాన్ని బట్టి తెలుస్తుంది. 

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరికీ అన్ని రకాలుగా సమాధానం గా కనిపిస్తున్నాడు జగపతిబాబు. అయితే ఈ ఒక్కడే అన్ని సినిమాల్లో నటించలేడు కాబట్టి మరో ఇద్దరు ముగ్గురి అవసరం ఎంతైనా ఉంది టాలీవుడ్ కి. ఆ నేపథ్యంలో హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీకాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. అంతే కాదు విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలో ఆయన నటించిన తీరుకు ప్రేక్షకులందరూ ఆయనను ఎంతగానో అభినందిస్తున్నారు. లవర్ బాయ్ గా ఎంతో క్యూట్ గా ఉండే శ్రీకాంత్ ఈ విధంగా ఆ పాత్రకు తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ కావడం అందరినీ మెప్పించింది.

అయితే శ్రీకాంత్ పర్ఫార్మెన్స్ కు అందరు ఫిదా అయినా కూడా మరిన్ని అవకాశాలు మాత్రం ఆయనకు రాకపోవడం ఇప్పుడు అందరినీ ఎంతగానో నిరాశపరుస్తుంది. దర్శక నిర్మాతలకు ఎందుకు అఖండ పాత్ర ఎక్క లేదో అర్థం కావడం లేదు కానీ శ్రీకాంత్ కు ఆ స్థాయిలో అవకాశాలు మాత్రం రావటం లేదు అని చెప్పాలి. తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాలో శ్రీకాంత్ మరొక అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతుంది అని శ్రీకాంత్ భావిస్తున్నాడు. మరి చరణ్ అయినా శ్రీకాంత్ కెరియర్ ని బిజీ చేస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: