అదేమిటంటే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఒకే స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు అంటూ ప్రచారం మొదలయ్యింది. విజయ దేవరకొండ ప్రస్తుతం లైగర్ చిత్రంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మినహా మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ ఉండనుంది.
అయితే ఈ మూవీ లో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ కూడా ఓ సీన్ లో కనిపించబోతున్నారు అని తెలుస్తోంది. అయితే ఈ సీన్ ఇంకా షూట్ చేయలేదట మొదట ఆ పాత్ర కోసం వేరే నటుడిని ఎంపిక చేయగా కొన్ని కారణాల వలన ఇపుడు ఆ పాత్ర కోసం ఆనంద్ ని చేయాలని అడిగినట్లు సమాచారం. ఈ విషయం ఇప్పటి వరకు లీక్ చేయకుండా సస్పెన్స్ గా ఉంచారట. మరి చూద్దాం ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.