ఇటీవల నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' సినిమాతో మళ్లీ విలన్ గా మారిపోయాడు సీనియర్ హీరో శ్రీకాంత్. ఈ సినిమాలో అతని పాత్ర ఆడియన్స్ ని బాగానే భయపెట్టింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా శ్రీకాంత్ ఈ సినిమాలో కనిపించాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ శంకర్ - చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ చిత్రంలో తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు ఈ సీనియర్ హీరో. శ్రీకాంత్ మాట్లాడుతూ..' నేను విలన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తర్వాత హీరోగా చేశాను. మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాను. ఇమేజ్ మార్కెట్ గురించి ఆలోచించకుండా అన్నిరకాల సినిమాల్లో నటించడానికి ఇష్టపడతాను.

సరైనోడు సినిమాలో బాబాయ్ క్యారెక్టర్ చేశాను. ఆ సినిమా హిట్ అయింది. ఆ టైంలో బోయపాటి నువ్వు విలన్ గా చేస్తాను ఉంటే నీకోసం మంచి పాత్ర డిజైన్ చేస్తాను, ఏది పడితే అది చేయకు అని నాతో అన్నారు. కానీ నేను యుద్ధం శరణం సినిమా చేశాను. అది అంతగా ఆడలేదు. ఇక ఆ తర్వాత నేను ఏ సినిమా చేయలేదు. అఖండ లో చేస్తున్నప్పుడు కూడా నాకు నమ్మకం లేదు. కానీ గెటప్ చూసుకున్నాక మాత్రం నమ్మకం కలిగింది. సినిమా విజయం సాధించడంతో ఆ నమ్మకం మరింత పెరిగింది. ఇప్పుడు శంకర్  - చరణ్ కాంబినేషన్ మూవీ లో కూడా నా లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఏంటి ఇతను శ్రీకాంతా? అనేలా ఆ పాత్ర ఉంటుంది' అంటూ శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

దీంతో మరోసారి చరణ్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దర్శకుడు శంకర్ సినిమాలో శ్రీకాంత్ పాత్రని అలా డిజైన్ చేస్తే.. మరి హీరో రామ్ చరణ్ పాత్రను ఇంకే రేంజ్లో డిజైన్ చేసి ఉంటాడని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అగ్రనిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: