సూపర్ స్టార్ మహేష్ తన భార్య నమ్రత శిరోద్కర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే ఎన్.ఎస్.జి (నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని). నువ్వు నా శిలవి. నా ప్రపంచంలో భాగమైనందుకు థ్యాంక్స్ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. మహేష్, నమ్రతలు 2005 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుండి మహేష్ కెరియర్ విషయంలో నమ్రత బ్యాక్ బోన్ గా నిలిచారు. నమ్రత పెళ్లి తర్వాతనే మహేష్ కెరియర్ సూపర్ స్ట్రాంగ్ గా మారిందని చెప్పొచ్చు. కథల విషయంలో మహేష్ దే ఫైనల్ డెశిషన్ అయినా కెరియర్ ప్లానింగ్ లో నమ్రత మహేష్ కు సలహాలు ఇస్తుందని అంటున్నారు.

1993లో మిస్ ఇండియాగా నిలిచిన నమ్రత శిరోద్కర్ మోడలింగ్ చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ తో వంశీ సినిమా చేశారు నమ్రత. ఆ సినిమా టైం లోనే వీరి అభిప్రాయలు కలవడం.. ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది. తను ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా సరే సినిమా సినిమాకు మధ్యలో గ్యాప్ వస్తే పూర్తిగా ఫ్యామిలీ కి టైం కేటాయిస్తాడు మహేష్. ఇక మహేష్ బాబు ప్రొడక్షన్ కి సంబందించిన విషయాలను నమ్రత దగ్గర ఉండి చూసుకుంటారు.

నమ్రత బర్త్ డే సందర్భంగా తన మిస్ ఇండియాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ యు ఆర్ మై రాక్ అంటూ ఆమె చాలా స్ట్రాంగ్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు మహేష్. మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఇంటికి సంబందించిన విషయాలను నమ్రత చాలా బాగా చూసుకుంటారని తెలుస్తుంది. మహేష్ కేవలం సినిమాలు మాత్రమే చేస్తూ ఉండగా మిగతా విషయాలన్నిటిని నమ్రత మాత్రమే మ్యానేజ్ చేస్తారని తెలుస్తుంది. అందుకే ఆమె తన బ్యాక్ బోన్ అని చాలా సందర్భాల్లో మహేష్ చెబుతూ వచ్చారు.      
 


మరింత సమాచారం తెలుసుకోండి: