మన టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం హిందీ యూట్యూబ్ ప్లాట్ ఫార్మ్స్ లో మంచి గిరాకీ ఉంది. అయితే ఈ డిమాండ్ ని గోల్డ్ మైన్స్ నిర్మాత మనీష్ షా కాస్త ముందుగానే ఊహించాడు. ఏ బాలీవుడ్ నిర్మాత తెలుగు సినిమాలను కొంతమందే గోల్డ్ మైన్స్ నిర్మాత మనీష్ తెలుగు సినిమాలను కొని పెద్ద నిర్మాతగా అయిపోయాడు. ఎంతగా అంటే తెలుగు హిట్ చిత్రాలను యూట్యూబ్లో డబ్ చేసి.. ఇప్పుడు నేరుగా థియేటర్లలో విడుదల చేసే స్థాయికి ఎదిగి పోయాడు. కాగా పుష్ప సినిమా దాదాపు 100 కోట్ల మార్కును బాలీవుడ్లో చేరుకోగా.. ఇకపై పలు తెలుగు పెద్ద హీరోల చిత్రాలను గోల్డ్ మైన్స్ నిర్మాత మనీష్ థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం అల వైకుంఠపురం లో హిందీ డబ్బింగ్ వెర్షన్ వాయిదా పడగా.. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప నార్త్ లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో యూట్యూబ్ లో బన్నీ తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ డబ్బు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇకపోతే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలకు కూడా నార్త్ లో ఫుల్ డిమాండ్ ఉంది. తెలుగులో ఉన్నట్లే అక్కడ చాలామంది మహేష్ బాబు కి లేడి ఫ్యాన్స్ ఉన్నారట.

ఈ క్రమంలోనే సర్కారు వారి పాట హిందీ థియేట్రికల్  రైట్స్ కోసం ఓ బడా సంస్థ పోటీపడి మరీ పెద్ద మొత్తంలో మహేష్ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే మధ్యలో గోల్డ్ మైన్స్ నిర్మాత మనీష్ వచ్చి ఆ నిర్మాత ఇచ్చిన మొత్తం కంటే రెట్టింపు ఇస్తాను.. హిందీ థియేట్రికల్ రైట్స్ ఇవ్వమని అడుగుతున్నారట. అంతలా నార్త్ లో మహేష్ కి ఫుల్ డిమాండ్ పెరిగింది. దీని ప్రకారం చూసుకుంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో బన్నీ కంటే మహేష్ కే అక్కడ ఎక్కువ డిమాండ్ వచ్చిందని చెప్పాలి. ఇకపై అల్లు అర్జున్, మహేష్ బాబు నటించబోయే భవిష్యత్ చిత్రాలు హిందీలో కూడా విడుదల కానున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: