అందాల ముద్దుగుమ్మ సమంత నాగ చైతన్య హీరోగా గౌతం మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది,  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సమంత అందచందాలకు, నటనకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు తగ్గడంతో సమంతకు టాలీవుడ్ లో క్రేజీ సినిమా అవకాశాలు తగ్గాయి, అందులో భాగంగా అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంత, అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడింది, వీరిద్దరికి గత కొద్ది కాలం క్రితమే విడాకులు కూడా అయ్యాయి. విడాకుల తర్వాత సమంత తన సినిమాల స్పీడ్ ను పెంచింది,  ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరి కొన్ని కొత్త సినిమాలను కూడా లైన్ లో పెడుతోంది, అందులో భాగంగా  సమంత ఇప్పటికే శాకుంతలం సినిమాను పూర్తి చేసి  యశోద సినిమాలో నటిస్తోంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్ టూర్ ఎంజాయ్ చేస్తుంది. అయితే అక్కడికి ఎందుకు వెళ్లింది అనేది మాత్రం తెలీదు కానీ.. అక్కడ సామ్ చేస్తున్న ఫోటోషూట్స్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి.

 మంచు కొండల్లో కొత్త కొత్త విన్యాసాలను సమంత నేర్చుకుంటుంది, సమంత తాజాగా స్విస్‏లో స్వింగ్ అనే ఆటను ఆడుతోంది. మంచు రహదారిలో దూసుకుపోతోంది, సమంత స్కేటింగ్ చేసినట్టుగా వీడియోను షేర్ చేస్తూ.. ఈగోను ఇంటివద్దే వదిలేసి రండి.. అంటూ వారు చెప్పారు. ఎంత కరెక్ట్‏గా చెప్పారో కదా ? అంటూ షేర్ చేసిన సమంత, ఇక న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అంటూ స్కింగ్ హ్యాష్‏ట్యాగులతో సమంత షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: