పవన్ కళ్యాణ్ పేరు చెప్పినా కాంప్రైజ్ కానంటున్నదట దేవిశ్రీప్రసాద్..అనవసరంగా మిస్ చేసుకుంటాడా..? ప్రస్తుతం ఇదే చర్చ నెటిజన్స్ మధ్య సాగుతుందని సమాచారం.

ఆ మధ్య కాస్త రేస్‌లో వెనకబడ్డ కూడా దేవీశీప్రసాద్ ఉప్పెన సినిమాతో మళ్ళీ తన సత్తా చాటి ఫాంలోకి వచ్చాడు. ఇక తాజాగా వచ్చిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 సినిమాకు డీఎస్పీ ఇచ్చిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో ముఖ్య పాత్ర పోషించాయి. ఈ సినిమా మేకింగ్ పరంగా సుకుమార్ మరియు పర్ఫార్మెన్స్ పరంగా అల్లు అర్జున్ అలాగే రష్మిక మందన్నలకు ఎంత పేరొచ్చి ప్రశంసలు దక్కాయో సంగీత దర్శకుడు అయిన దేవిశ్రీప్రసాద్‌కు అంతే ప్రశంసలు దక్కాయి.

ఇక చేతిలో పుష్ప పార్ట్ 2 మరియు పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్‌ల భవదీయుడు భగత్‌సింగ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడట.అయితే పుష్ప పార్ట్ 1 సక్సెస్ తర్వాత దేవిశ్రీప్రసాద్ రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్టు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్న దాని ప్రకారం ఇప్పుడు కమిటయ్యే సినిమాలను ఏకంగా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.. అయితే మధ్యలో కాస్త ఈ రాక్ స్టార్ రేస్‌లో వెనకబడ్డాడులే కానీ, లేదంటే సౌత్‌లో తెలుగు మరియు తమిళ సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడిపాడు. ఈ రెండు భాషలలో ఏ స్టార్ హీరో సినిమా అయినా మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రం దేవిశ్రీనే ఎంచుకునేవారట..


మళ్ళీ అదే జోరు ఇప్పుడు చూపిస్తున్నాడట.. ఇక పవన్ కళ్యాణ్ భవదీయుడు చిత్రానికి దేవిశ్రీప్రసాద్ రూ. 5 కోట్లు అడిగినా మేకర్స్ ఇవ్వడానికి ఎస్ అన్నారని తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ అంటే దేవిశ్రీకి ప్రత్యేకమైన అభిమానమని అందుకే గబ్బర్ సింగ్ సినిమాతో అదిరిపోయే ఆల్బం ఇచ్చారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో చాలా బ్లాక్ బస్టర్స్ సాంగ్స్ వచ్చాయి. అంతకంటే భారీ హిట్ అయ్యే ఆల్బం భవదీయుడు చిత్రానికి ఇవ్వడం గ్యారెంటీ అని తెలుస్తుంది.అయితే క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ దేవీ పవన్ కళ్యాణ్ – హరీశ్ శంకర్ సినిమాకు ఆల్రెడీ అద్భుతమైన ట్యూన్స్ కూడా రెడీ చేశాడట. త్వరలో రికార్డింగ్ మొదలబోతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: