గతంలో కూడా ఖరీదైన కారును కొనుగోలు చేసి.. దానిని తనకు అనుగుణంగా మార్చుకొని రీమోడలింగ్ చేయించుకున్నాడు అన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న ఎదురు కాదా.. నాగచైతన్య మాట్లాడుతూ.. చైతన్య బర్తడే కి తన తండ్రి ఒక కారు ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ కార్ ను తన టేస్ట్ కి తగినట్లు మార్చుకున్నారని తెలియజేశాడు. జపాన్ నుంచి దానికి సంబంధించిన కొన్ని పార్ట్స్ తెప్పించి.. మార్చేసుకున్నాను అని తెలియజేశాడు. అంతేకాకుండా కార్లు, బైక్ ల ప్రపంచం అంటే తనకు ఎంతో ఇష్టమని కూడా తెలియజేశారు.
సినిమాల తర్వాత ఇష్టపడే వాటిలో ముందు ఇదే ఉంటుంది అని తెలియజేశాడు. ఇక అంతే కాకుండా మార్కెట్లోకి విడుదలైన కొత్త వాహనాల గురించి బాగా తెలుసుకుంటూ ఉంటాను అని తెలియజేశాడు నాగచైతన్య. ఇక నాగార్జున కూడా మాట్లాడుతూ తనకు కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం అని తెలియజేశాడు.. కానీ వీటి కంటే ముందు నాకు ఎక్కువగా సైకిల్ పైన తిరగడం చాలా ఇష్టం అని తెలియజేశాడు. కాలేజీకి వెళ్లే సమయాలలో ఎక్కువగా సైకిల్ పైన వెళ్లే వాడిని అని తెలియజేశాడు. ప్రస్తుతం అయితే అందరూ ఎక్కువగా కార్లను ఉపయోగిస్తున్నారని తెలియజేశాడు.