హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ ఉంది. ఇక అన్ని భాషల్లో ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ శృతిహాసన్ కు మాత్రం తన మొదటి విజయాన్ని అందించింది మాత్రం.. తెలుగు ఇండస్ట్రీ ప్రజలే అని ఆమె తెలియజేసింది.. అందుచేతనే వారు అంటే తెగ ఇష్టమని చెప్పుకొస్తోంది శృతిహాసన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ తెలుగులోనే లక్కీ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటిసారిగా గబ్బర్ సింగ్ రూపంలో ఈమెకు అదృష్టం తలుపు తట్టింది అని చెప్పవచ్చు.

ఇక ఈ నెల 28వ తేదీన శ్రుతిహాసన్ బర్త్ డే ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియాతో తెలియజేసింది.. సూర్యతో నటించిన సెవెంత్ సెన్స్ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు తన మీద తనకు నటించగలనే నమ్మకం వచ్చిందని తెలియజేసింది.. ఆ నమ్మకాన్ని ,ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం డైరెక్టర్ మురుగదాస్ అని తెలియజేసింది.. ఇక ఆయన చెప్పిన మాటలు విని నేను ఆ పాత్రను తేలికగా చేశానని తెలిపింది. ఇక ఆ సినిమాలో ఆ పాత్ర చేయగలనో లేదో అని భయపడుతూ ఉంటే.. మురుగదాస్ నేను నిన్ను నమ్ముతున్నాను.. నీ మీద నీకు నమ్మకం లేదా.. అని తెలియజేశారట మురుగదాస్.


కానీ తనను ఫస్ట్ హీరోయిన్గా స్వీకరించింది మాత్రం తెలుగు ప్రేక్షకులే.. నా మొదటి విజయం కూడా అక్కడే దక్కిందని తెలియజేసింది. అందుచేత నేను ఎన్ని భాషలలో నటిస్తున్నప్పటికీ తెలుగులో నటించడం అంటే నాకు చాలా ఇష్టం అని తెలియజేసింది.. అది సీనియర్ హీరోలు అయినా సరే ఎవరితోనైనా సరే నటించడానికి నాకు ఇష్టం అని తెలిపింది.. తను 13 ఏళ్ల గా సినీ కెరీర్ లోనే ఉన్నానని తెలిపింది.. అంతే కాకుండా తన వయసు గురించి తెలుపుతూ.. అది ఎంత దాచినా దాగని తెలుగు వస్తుంది.. ప్రతి ఒక్కరూ వయసు తగ్గట్టుగా మనుషులు మారుతూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. వయసు పెరిగే కొద్దీ ఎవరి శరీరంలో అయినా మార్పులు వస్తాయని.. నా శరీరంలో కూడా మార్పులు వచ్చాయి.. అందుకు  నేను ఫీలవ్వను అని తెలిపింది శృతిహాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: