ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్‌ని చూసి కపుల్‌ అంటే అలా ఉండాలి. భార్య సినిమాలు డైరెక్ట్‌ చేస్తుంది. భర్త వాటిల్లో నటిస్తాడు. ఇద్దరూ వాళ్ల కెరీర్‌ని ఎంత బాగా డిజైన్‌ చేసుకున్నారో అని చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్లు. అయితే 18 ఏళ్లుగా మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌గా కనిపించిన వీళ్లిద్దరూ కరోనా థర్డ్‌వేవ్‌లో విడాకులు తీసుకున్నారు. ధనుష్‌ కంటే ఐశ్వర్య రజనీకాంత్ రెండేళ్లు పెద్ద. వీళ్లిద్దరు లవ్‌ మేరేజ్‌ చేసుకునేటప్పుడు వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటనే ప్రశ్నలొచ్చాయి. అయితే ప్రేమకి, పెళ్లికి ఈ లెక్కలు అడ్డంకులు కావని ఏడడుగులు వేశారు. వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 18 ఏళ్లుగా కలిసి జీవిస్తోన్న వీళ్లు, భవిష్యత్తును మరింత బ్రైట్‌ గా మార్చుకునేందుకు విడిపోతున్నామని పోస్టులు పెట్టారు.

ఇక టాలీవుడ్‌లో మోస్ట్‌ లవబుల్ కపుల్ అనే ట్యాగ్‌ లైన్‌ తెచ్చుకున్న కపుల్‌ నాగచైతన్య, సమంత. ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీతో మొదలైన వీళ్ల లవ్‌స్టోరీ, 2017లో పెళ్లి పీటలెక్కింది. అయితే నాలుగేళ్ల పాటు బాగానే సాగిన వీళ్ల పెళ్లి బంధానికి 2021 అక్టోబర్‌లో డివోర్స్ కార్డ్‌ పడింది. పదేళ్ల నుంచి స్నేహితులుగా ఉన్న తాము.. విడాకుల తర్వాత కూడా స్నేహితుల్లా  ఉంటామంటూ పోస్టులు కూడా పెట్టారు.

అమలా పాల్‌, ఎ.ఎల్. విజయ్‌ని పెళ్లి చేసుకున్నాక సినిమాలకి బ్రేక్‌ ఇచ్చింది. కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైంది. అయితే మళ్లీ కెరీర్‌ స్టార్ట్‌ మొదలు పెట్టాలనుకున్నప్పుడు విజయ్ ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు వచ్చాయట. ఈ డిఫరెన్సెస్‌ కాస్తా డిస్ట్రబెన్సెస్‌గా మారి ఇద్దరూ విడిపోయారు. ఇక ఈ విడాకులకి ధనుష్‌  కారణమని ఒక సందర్భంలో ఎ.ఎల్. విజయ్‌ తండ్రి ఆరోపించాడు. మొత్తానికి కొన్ని జంటలు చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్నారు. చిన్న చిన్న గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి విడాకుల దాకా తీసుకొస్తున్నాయి. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే విడాకుల దాకా వచ్చే అవకాశాలు తక్కువని నిపుణులు అంటున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: