పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న దర్శకులకు ఇప్పుడు ఆయన డెడ్ లైన్ పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ తరఫున ప్రచారం చేయాలనే ఉద్దేశంతో పవన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడట. ఒక దర్శకుడికి 60 రోజుల వ్యవధి మాత్రమే కేటాయించి తన సినిమాను తొందరగా పూర్తి చేసే విధంగా పవన్ ప్రణాళికలు రచించినట్లు తెలుస్తుంది. ఆయన హీరోగా చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ పూర్తయింది. తొందర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

అయితే ఆ తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కాల్షీట్స్ ను 60 రోజులకు మించి ఇవ్వకూడదని దర్శకులకు సూచిస్తున్నారట. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాకు సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తర్వాత ఆయన చేయబోయే హరీష్ శంకర్ భగవద్గీత సినిమాకు అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు కేవలం 120 రోజుల కాల్సీట్లను మాత్రమే కేటాయించాడని తెలుస్తుంది.

 ఈ ఇద్దరు కూడా 60 రోజులు డేట్స్ లో మాత్రమే పవన్ కళ్యాణ్ సీన్స్ షూట్ చేయాలట. అన్ని రోజులు మాత్రమే పవన్ ఆ సినిమా కి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో వారు తమ సినిమాలను అరవై రోజులలో ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది చూడాలి. ఇక ఈ రెండు సినిమాల తరువాత కూడా పవన్ మరిన్ని సినిమాలను ఒప్పుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాడు. ఎలక్షన్ లు మొదలయ్యే లోపు దాదాపుగా సినిమాల్లో నటించి ఆయన ప్రేక్షకులను అలరింప చేయాలనేది ఆయన ఉద్దేశం. మరి పవన్ పెట్టిన ఈ డెడ్ లైన్ ను అయన దర్శకులు ఎలా వినియోగించుకుని ఆయనతో సినిమాలు చేస్తారో చూడాలి. పవన్ భవిష్యత్ సినిమాలు ఏంటో కూడా చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: