టాలీవుడ్ లో 'అల్లుడు శీను' సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా కష్టపడుతున్నారు.బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ మాత్రం సరైన హిట్ ని అందుకోలేకపోతున్నాడు. అయినా కూడా తన ప్రయత్నాన్ని ఆపకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక చివరగా అల్లుడు అదుర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లం బాబు.. ఇప్పుడు బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం చత్రపతి ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు ఈ హీరో.

 టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వి వి వినాయక్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ''స్టువర్ట్ పురం దొంగ' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని సైతం రిలీజ్ చేశారు. 1970లో స్టువర్ట్ పురం లో పేరుమోసిన దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. పోలీసులను పక్క ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు అప్పట్లో పేదల పట్ల దేవుడు గా మారాడు. అయితే ఇప్పుడు ఇదే కథతో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమా రాబోతోంది.

లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె ఎస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఇదే కథతో మాస్ మహారాజా రవితేజ కూడా 'టైగర్ నాగేశ్వర్ రావ్' అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. దీంతో రవితేజ - బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు మధ్య గట్టి పోటీ తలెత్తుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ రేసు నుండి బెల్లంకొండ శ్రీనివాస్ తప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోయే 'స్టువర్టుపురం దొంగ' సినిమాను తప్పించాలని మేకర్స్ నిర్ణయానికి వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: