సినిమా ఇండస్ట్రీలో పోటీతత్వం అనేది ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక హిట్ వచ్చిన హీరోలతో సమానంగా సినిమా అవకాశాలను సంపాదించుకోవాలని చాలామంది నటీనటులు హిట్ కొట్టే సినిమాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇక కొంతమంది నటీనటుల సూపర్ హిట్లు సాధించి నంబర్ వన్ స్థానం లోకి వెళ్లిపోతారు.మరి కొంతమంది ఆ నంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడానికి వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా హీరోయిన్ల మధ్య పోటీ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఒకటి రెండు సినిమాలు హిట్ అయి.. తమ నటనతో మెప్పిస్తే తప్పకుండా ఆ హీరోయిన్ కి స్టార్ స్టేటస్ వచ్చే అవకాశం ఉంటుంది. 

ఆ విధంగా ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న ఓ కుర్ర హీరోయిన్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ ని తన బుట్టలో వేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుందట. ఇప్పటికే ఆమెకు గోల్డెన్ లెగ్ అని పేరు కూడా రావడంతో.. సదరు నిర్మాతలు హీరోయిన్ని మార్చే ఆలోచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని కోసం ఆ కుర్ర హీరోయిన్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందట. ఇటీవలే గ్లామర్ షో లు కూడా మొదలు పెట్టినా ఆ హీరోయిన్.. ఇకపై తాను చేయబోయే సినిమాల్లో అందాల ఆరబోత తగ్గేది లేదు అన్నట్లుగా చేయాలని చూస్తోందట.

అలా ఇప్పుడు నటిస్తున్న సినిమాలతో ఎలాగైనా కెరీర్ను సెట్ చేసుకోవాలని సదరు హీరోయిన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అటు నిర్మాతలు సైతం తమ సినిమాల్లో గ్లామర్ ఒలకబోస్తే ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ హీరోయిన్ ఫుల్ గ్లామర్ షో కి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తన గ్లామర్ తో రెచ్చిపోయి స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంటుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: